దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు! | Sakshi
Sakshi News home page

National T20 Cup: దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు!

Published Mon, Dec 4 2023 5:57 PM

National T20 Cup: matchPakistan batter Tahir Baig departs after one of a kind hit wicket dismissal  - Sakshi

పాకిస్తాన్‌ నేషనల్‌ టీ20 కప్‌లో భాగంగా డిసెంబర్‌2న అబోటాబాద్, సియాల్‌కోట్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సియాల్‌కోట్‌ ఓపెనర్‌, పాక్‌ యువ బ్యాటర్‌  మీర్జా తాహిర్‌ను దురదృష్టం వెంటాడింది. ఎవరూ ఊహించని విధంగా హిట్‌వికెట్‌గా తాహిర్‌ వెనుదిరిగాడు.

ఏం జరిగిందంటే..?
సియాల్‌కోట్‌ ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్‌లో తాహిర్‌ బ్యాక్ ఫుట్‌లో నుంచి  పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు వెనుక్కి వెళ్లి షాట్‌ ఆడే క్రమంలో అతడి బరువు బ్యాక్‌ఫుట్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా తాహిర్‌ కుడి కాలి కండరాలు పట్టేసాయి. ఈ క్రమంలో నొప్పితో విల్లావిల్లాడిన అతడు బ్యాలెన్స్‌ కోల్పోయి స్టంప్స్‌పై పడిపోయాడు.

దీంతో 38 పరుగులు చేసిన తహిర్‌ హిట్‌వికెట్‌గా నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్యాడ్‌ లక్‌ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సియాల్‌కోట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సియాల్‌కోట్‌ బ్యాటర్లలో తాహిర్‌దే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో అబోటాబాద్ ఛేదించింది.
చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

 
Advertisement
 
Advertisement