National Open Athletics: పారుల్‌ డబుల్‌ ధమాకా

National Open Athletics Championships: Parul Chaudhary Wins Second Gold Medal - Sakshi

స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకం

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌

సాక్షి, వరంగల్‌ స్పోర్ట్స్‌: రైల్వేస్‌ అథ్లెట్‌ పారుల్‌ చౌదరి(Parul Chaudhary) డబుల్‌ ధమాకా సాధించింది. జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె రెండో స్వర్ణం సాధించింది. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆమె తాజాగా మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్‌లోనూ విజేతగా నిలిచింది. పోటీల ప్రారంభ రోజే పారుల్‌ 5000 మీటర్ల పరుగులో కూడా బంగారు పతకం సాధించింది.

శుక్రవారం జరిగిన మూడు వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్లో పారుల్‌ చౌదరికి మహారాష్ట్ర అథ్లెట్‌ కోమల్‌ చంద్రకాంత్‌ జగ్దలే గట్టిపోటీ ఇచి్చంది. చివరకు 0.02 సెకన్ల అతి స్వల్ప తేడాతో పారుల్‌ (9ని.51.01 సె) పసిడి పతకం పట్టేసింది. కోమల్‌ 9 ని.51.03సెకన్ల టైమింగ్‌తో రజతంతో సరిపెట్టుకొంది. ఈ ఈవెంట్‌లో ప్రీతి (రైల్వేస్‌; 10 ని.22.45 సె.) కాంస్యం గెలిచింది. పోటీల మూడో రోజు కూడా రైల్వేస్‌ అథ్లెట్ల హవానే కొనసాగింది. ఐదు ఈవెంట్లలో రైల్వేస్‌ అథ్లెట్లు బంగారు పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో సందేశ్, షాట్‌పుట్‌లో కరణ్‌వీర్‌ సింగ్, మహిళల లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య, హర్డిల్స్‌లో కనిమొని బంగారు పతకాలు సాధించారు.  

నిరాశ పరిచిన నందిని...
తెలంగాణ అమ్మాయి అగసర నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో నిరాశపరిచింది. ఇటీవల నైరోబి (కెన్యా)లో జరిగిన ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో సెమీస్‌ చేరిన నందిని... ఆశ్చర్యకరంగా జాతీయ ఓపెన్‌ పోటీల్లో విఫలమైంది. శుక్రవారం జరిగిన మహిళల వంద మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో ఆమె 14.30 సెకన్ల  టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఇందులో కనిమొని (రైల్వేస్‌; 13.54 సె.) విజేతగా నిలువగా, అపర్ణ రాయ్‌ (కేరళ; 13.58 సె.), కె.నందిని (తమిళనాడు; 13.90 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మిక్స్‌డ్‌ 4్ఠ400 మీ.రిలేలో తెలంగాణ బృందం అసలు పరుగునే  పూర్తి చేయలేకపోయింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top