Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియ‌న్స్.. రాడనుకున్న ఆర్చ‌ర్ వ‌చ్చేస్తున్నాడు..!

Mumbai Indians Pacer Jofra Archer Starts Training In Nets - Sakshi

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా అర్చర్‌ను ముంబై ఇండియన్స్‌ 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండనని ఆర్చర్‌ ముందే ప్రకటించాడు. ఈ విషయం తెలిసినా ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం అతనిపై భారీ మొత్తం వెచ్చించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా- ఆర్చర్‌ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుందని, అందుకే తమకు నష్టం వాటిల్లినా ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ఫ్రాంచైజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే, ఈనెల 26 నుంచి ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు ఓ శుభ‌వార్త అందింది. రాడనుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆర్చర్‌ ఈ సీజ‌న్ నుంచే అందుబాటులో ఉంటాడని ముంబై యాజమాన్యం పరోక్ష సంకేతాలు పంపింది. మైదానంలో ఆర్చ‌ర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పరుగుల ప్ర‌వాహం చూసేందుకు ఇకపై ఆగలేమంటూ అంటూ రాసుకొచ్చింది. దీని బట్టి చూస్తే ఆర్చర్‌ ఈ సీజన్‌ నుంచే బుమ్రాతో కలిసి బంతి పంచుకోవడం ఖాయమని తెలుస్తోంది. 

ముంబై ఇండియ‌న్స్: రోహిత్ శర్మ (16 కోట్లు), జ‌స్ప్రీత్‌ బుమ్రా (12 కోట్లు), కీరన్‌ పొలార్డ్ (6 కోట్లు), సూర్యకుమార్ యాద‌వ్ (8 కోట్లు), ఇషాన్‌ కిషన్ (15.25 కోట్లు), టిమ్‌ డేవిడ్ (రూ. 8.25 కోట్లు), జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు), డేవిడ్ బ్రెవిస్‌ (3 కోట్లు), డేనియల్‌ సామ్స్‌ (రూ. 2.60 కోట్లు), తిలక్‌ వర్మ(1.70 కోట్లు), మురుగన్‌ అశ్విన్ (1.60 కోట్లు), టైమల్‌ మిల్స్‌ (1.50 కోట్లు), జయ్‌దేవ్‌ ఉనద్కత్ (1.30 కోట్లు), రిలే మెరెడిత్ (కోటి), ఫాబియన్‌ అలెన్ (75 లక్షలు), మయాంక్‌ మార్కండే ( 65 లక్షలు), సంజయ్‌ యాదవ్ (50 లక్షలు), బాసిల్ థంపి (30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు), ఆర్యన్ జుయల్‌ (20 లక్షలు), హృతిక్‌ షోకీన్‌ (20 లక్షలు), మహ్మద్‌ అర్షద్‌ ఖాన్‌ (20 లక్షలు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (20 లక్షలు), రాహుల్‌ బుద్ది (20 లక్షలు), రమణ్‌ దీప్‌ సింగ్ (20 లక్షలు).
చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్‌ ధర..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top