My Mum Still Believes I Should Not Have Been Smashing The Glass: Rahul Dravid - Sakshi
Sakshi News home page

మా అమ్మ ఇప్పటికీ నమ్మడం లేదు.. ‘క్రికెటర్‌’ వ్యాఖ్యలు వైరల్‌! ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Jul 11 2023 4:34 PM | Updated on Jul 11 2023 4:58 PM

Mum Still Believes I Should Not Been Smashing Glass: Rahul Dravid - Sakshi

Ind Vs WI 2023: భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎంత కూల్‌గా, కామ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే. టీమిండియా వాల్‌గా అపజయాలకు అడ్డుపడి టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. క్రెడ్‌ యాడ్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ పేమెంట్‌ యాప్‌ క్రెడ్‌కు సంబంధించిన 2021 నాటి ప్రచార వీడియోలో ఎప్పుడూ లేని విధంగా ద్రవిడ్‌ తనలోని భిన్నకోణాన్ని ప్రదర్శించాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘రాహుల్‌ ద్రవిడ్‌కు కోపం కూడా వస్తుందా?’’ అంటూ ఆశ్చర్యపోయారు. అంతలా జీవించేశాడు ద్రవిడ్‌. 

నేను ఇందిరానగర్‌ గూండాను
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి కోపంతో ఊగిపోతూ.. పక్క కార్లను బ్యట్‌తో ధ్వంసం చేస్తూ.. ‘‘నేను ఇందిరానగర్‌ గూండాను’’ అంటూ అరుస్తాడు ద్రవిడ్‌ ఆ యాడ్‌లో!! ఇక ఈ వీడియోపై స్పందిస్తూ ద్రవిడ్‌ కునాల్‌ షా(క్రెడ్‌ వ్యవస్థాపకుడు)తో జరిపిన పాత సంభాషణకు సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ వీడియోలో.. ‘‘నిజానికి నేను చాలా కామ్‌గా ఉంటాను. కానీ ఈ యాడ్‌లో ఎప్పుడు ఎందుకు అరుస్తానో తెలియదు. పక్కవాళ్లకు కోపం, విసుగు తెప్పించేలా ప్రవర్తిస్తాను. ఈ యాడ్‌పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అని భయపడ్డా.

అమ్మ ఇప్పటికీ నమ్మడం లేదు
కానీ అందరూ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. కానీ మా అమ్మ మాత్రం ఇప్పటికీ దీనిని యాక్సెప్ట్‌ చేయలేకపోతోంది. మా అమ్మ దృష్టిలో ఇప్పటికీ నేను కనీసం గ్లాసు కూడా పగలకొట్టలేనంత శాంత స్వభావుడినే!!’’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు. ఇక యాడ్‌లో నటించడం తనకు కొత్త కాబట్టి.. షూటింగ్‌ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డాడని ద్రవిడ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. 

నెలరోజుల పాటు కరేబియన్‌ దీవిలో
టీమిండియా వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ నెల రోజుల పాటు బిజీగా గడుపనున్నాడు. జూలై 12- ఆగష్టు 13 వరకు కరేబియన్‌ దీవి టూర్‌లో జట్టుతో పాటు బస చేయనున్నాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు ఇప్పటికే విండీస్‌ గడ్డపై అడుగుపెట్టింది.

చదవండి: టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు
Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement