ల్యాండ్‌ రోవర్‌ కారు కొన్న సిరాజ్‌ | Mohammed Siraj Purchase New Land Rover Car, Pics Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ రోవర్‌ కారు కొన్న సిరాజ్‌

Aug 11 2024 7:46 PM | Updated on Aug 12 2024 1:02 PM

Mohammed Siraj Purchase New Land Rover Car

టీమిండియా క్రికెటర్‌, హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తనకెంతో ఇష్టమైన ల్యాండ్‌ రోవర్‌ కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సిరాజ్‌ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. కొత్త కారుతో సిరాజ్‌ ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ కారును తన కుటుంబం కోసం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దేవుడి ఆశీర్వాదంతో తన కలల కారును సొంతం చేసుకున్నట్లు తెలిపాడు.

మీ కలలపై ఎలాంటి పరిమితులు ఉండవు. అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా కష్టపడి పని చేసేలా చేస్తాయి. నిలకడతో చేసే ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నా కలల కారును కొనుగోలు చేసేలా చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడికి కృతజ్ఞతలు. నిన్ను నువ్వు నమ్ముకుంటే అనుకున్నది సాధించగలవు అంటూ సిరాజ్‌ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా, సిరాజ్‌ అత్యంత పేద కుటుంబం నుంచి దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, సిరాజ్‌ ఇటీవల శ్రీలంకతో ముగిసిన పరిమిత ఓవర్లలో సిరీస్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. టీ20, వన్డే సిరీస్‌లలో సిరాజ్‌ పూర్తిగా తేలిపోయాడు. భవిష్యత్తులో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లలోనైనా సిరాజ్‌ ఫామ్‌ను అందుకోవాలని ఆశిద్దాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement