
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రొనాల్డోను అనుకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటి సిరాజ్ రొనాల్డోను అనుకరించడం ఏంటని డౌట్ పడొద్దు. విషయంలోకి వెళితే సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ వాండర్ డుసెన్‌ను ఔట్ చేయడం ద్వారా ఆ గడ్డపై తొలి వికెట్ సాధించాడు.
చదవండి: IND Vs SA: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు
ఇన్నింగ్స్ 12.5 ఓవర్ ఐదో బంతిని డుసెన్ డిఫెన్స్ చేయబోయి స్లిప్‌లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ తీశానన్న ఆనందంలో సిరాజ్ ఒక్క నిమిషం రొనాల్డోగా మారిపోయాడు. గోల్ కొట్టిన ప్రతీసారి రొనాల్డో ఇచ్చే హవభావాలు ప్రతీ అభిమానిని ఆకట్టుకుంటుంది. తాజాగా సిరాజ్ కూడా అచ్చంగా రొనాల్డోను దింపేశాడు. మూడు యాంగిల్స్‌లో రొనాల్డో ఫోజును దించిన సిరాజ్‌కు సంబంధించిన ఫోటోను క్రిక్‌టాకర్ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
చదవండి: Test Player Of Year: 'టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' ఎవరు? రేసులో టీమిండియా స్పిన్నర్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా టీ విరామ సమయానికి 109 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లలో షమీ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, బుమ్రా, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు.
SIRAJ 🔥🔥 that celebration 💉🥵 pic.twitter.com/97fxWjhmn5
— FLICK. (@chirutha_18) December 28, 2021