IND Vs LEIC: పుజారా డకౌట్‌.. షమీ వింత సెలబ్రేషన్‌

Mohammed Shami Dismisses Cheteshwar Pujara For Duck Celebration Viral - Sakshi

కౌంటీల్లో వరుస సెంచరీలో దుమ్మురేపిన చతేశ్వర్‌ పుజారా డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా లీస్టర్‌షైర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో సున్నాకే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. షమీ వేసిన గుడ్‌లెంగ్త్‌ డెలివరీకి పుజారా వద్ద సమాధానం లేకుండా పోయింది.

ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. పుజారా, షమీ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్న పుజారా వైపు పరిగెత్తుకొచ్చిన షమీ వెనుక నుంచి అతన్ని గట్టిగా హగ్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి రోజును 246/8తో ముగించిన టీమిండియా.. లీస్టర్‌షైర్‌లోని  మిగతా టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ అవకాశం ఇవ్వడం కోసం అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. అయితే ఉదయం సెషన్‌లో లీస్టర్‌షైర్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ సామ్‌ ఇవన్స్‌, పుజారాలు ఔటయ్యాకా.. మరో ఓపెనర్‌ లుయిస్‌ కింబర్‌(31), జోయ్‌ ఎవిసన్‌(22) ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించారు. వీరిద్దరు ఔట్‌ కాగా.. ప్రస్తుతం లీస్టర్‌షైర్‌ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ 16, రిషి పటేల్‌ 13 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: Virat Kohli: రూట్‌ మ్యాజిక్‌ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా!

రోహిత్‌ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top