ENG vs IND: 'ఇంగ్లండ్‌లో అతడు చెలరేగి ఆడుతాడు.. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు..'

Mohammad Azharuddin backs Virat Kohli to shine in England - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2022లోనూ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 341 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్నటీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ ఫామ్‌పై భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లి మరింత బలంగా పుంజుకుంటాడని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. 

"విరాట్‌ కోహ్లి 50పైగా పరుగులు చేసినా అతడు విఫలమైనట్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కోహ్లి పెద్దగా ఆడలేదు. ఎటువంటి స్టార్‌ ఆటగాళ్లైనా ఏదో ఒక దశలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. కోహ్లి కూడా అంతే. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. అయితే అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. కాబట్టి ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను. కోహ్లి ఒక సెంచరీ సాధిస్తే.. అతడిలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది" అని అజారుద్దీన్ పేర్కొన్నాడు.
చదవండిHardik Pandya: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్‌-డి ప్లేయర్‌'.. టీమిండియా మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top