మయామి ఓపెన్‌ చాంపియన్‌ కోలిన్స్‌  | Miami Open champion Collins | Sakshi
Sakshi News home page

మయామి ఓపెన్‌ చాంపియన్‌ కోలిన్స్‌ 

Apr 1 2024 1:35 AM | Updated on Apr 1 2024 1:35 AM

Miami Open champion Collins - Sakshi

ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్‌ ప్లేయర్‌ డానియల్‌ కోలిన్స్‌ అద్భుతం చేసింది. మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్‌ 7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ రిబాకినా (కజకిస్తాన్‌)పై గెలిచింది.

కోలిన్స్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్‌ ఎవర్ట్, వీనస్‌ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్‌ స్టీఫెన్స్‌ తర్వాత మయామి ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన ఆరో అమెరికన్‌ ప్లేయర్‌గా కోలిన్స్‌ గుర్తింపు పొందింది.   

Advertisement
 
Advertisement
Advertisement