మనూ భాకర్‌కు స్వర్ణం.. | Sakshi
Sakshi News home page

ISSF Presidents Cup: మనూ భాకర్‌కు స్వర్ణం..

Published Wed, Nov 10 2021 8:08 AM

Manu Bhaker Wins 2nd Gold at ISSF Presidents Cup - Sakshi

వ్రోక్లా (పోలాండ్‌): ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత షూటర్లు మనూ భాకర్, రాహీ సర్నోబత్‌ మెరిశారు. మనూ భాకర్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించగా... రాహీ సర్నోబత్‌ 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో రజత పతకం కైవసం చేసుకుంది.

ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో మనూ (భారత్‌)–ఒజ్‌గుర్‌ వార్లిక్‌ (టర్కీ) జంట 557 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం నెగ్గింది. 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో రాహీ 31 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది.

చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్‌ ఫెవరెట్‌.. న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా!

Advertisement
 
Advertisement
 
Advertisement