ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయ‌ర్‌ | LSGs International Player Leaves The Team Midway In IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయ‌ర్‌

Apr 20 2026 9:31 PM | Updated on Apr 20 2026 9:31 PM

LSGs International Player Leaves The Team Midway In IPL 2026

ఐపీఎల్‌-2026లో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ షాక్ త‌గిలింది. సౌతాఫ్రికా స్పీడ్ అన్రిచ్ నోకియా సీజ‌న్ మ‌ధ్య‌లోనే లక్నో జ‌ట్టును వ‌దిలి స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. అత‌డి భార్య త్వ‌ర‌లోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. 

దీంతో త‌న భార్య వ‌ద్ద ఉండేందుకు నోర్జే పితృత్వ సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సీజన్‌లో నోకియా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

దీంతో తర్వాత మ్యాచ్‌లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఇక లక్నో విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో కూడా పంత్ టీమ్‌కు ఏదీ కలిసి రావడంలేదు. లక్నో బౌలింగ్‌ పరంగా కాస్త బలంగా ఉన్నప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 22న ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి: అత‌డిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్‌

Advertisement
 
Advertisement
Advertisement