IND vs BAN: లిటన్‌ దాస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. విరాట్‌ కోహ్లి షాక్! వీడియో వైరల్‌

Litton Das takes a stunning catch to dismiss Virat Kohli - Sakshi

టీమిండియాతో తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. భారత ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ వేసిన షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో మూడో బంతిని విరాట్‌ కోహ్లి కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లిటన్ దాస్ డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

దీంతో ఒక్క సారిగా కోహ్లి కూడా షాక్‌కు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక లిటన్‌ దాస్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

186 పరుగులకే భారత్‌ ఆలౌట్‌
ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 186 పరుగులకే ఆలౌటైంది. భారత ​బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో షకీబ్‌ అల్‌ హసన్‌ ఐదు వికెట్లు, ఎబాడోత్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టారు

చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌.. రిషబ్‌ పంత్‌ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top