చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌ | Litton Das Creates World Record, Becomes 1st Wicketkeeper In The World To Claim This | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌

Oct 13 2026 4:27 PM | Updated on Oct 13 2026 4:40 PM

Litton Das Creates World Record, Becomes 1st Wicketkeeper In The World To Claim This

source: X

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అబదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ చారిత్రక ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో లిట్టన్‌ 150కి పైగా పరుగులు చేయడంతో పాటు తొమ్మిది క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు.

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ ఐదో రోజు ఆటలో దాస్ అద్భుతమైన క్యాచ్‌తో ఇక్రమ్ అలీఖిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడి ఖాతాలో తొమ్మిది క్యాచ్‌లు చేరాయి.

ఈ మ్యాచ్‌లో దాస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న అతడు, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు క్యాచ్‌లు పట్టాడు.

ఏబీ డివిలియర్స్, బెయిర్‌స్టో రికార్డులను అధిగమించి..
2013లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్  134 పరుగులు చేయడంతో పాటు వికెట్ల వెనుక 11 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2016లో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో 140 పరుగులు చేసి, వికెట్ల వెనుక తొమ్మిది ఔట్లలో భాగస్వామి అయ్యాడు.

ఒకే టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించడంతో పాటు తొమ్మిది క్యాచ్‌లు అందుకున్న ఏకైక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ లిట్టన్‌ దాస్‌ మాత్రమే.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్‌ పోరాడుతుంది. సెదిఖుల్లా అటల్‌ (102) అద్భుతమైన సెంచరీతో తన జట్టును గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఆట చివరి రోజు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఫ్ఘనిస్తాన్‌ మరో 228 పరుగులు చేయాలి. ప్రస్తుతం రెండో సెషన్‌ ఆట కొనసాగుతుంది. అటల్‌కు జతగా హష్మతుల్లా షాహిది (25) క్రీజ్‌లో ఉన్నాడు. 

ఇదీ చదవండి: టెస్టు క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. 30 వికెట్లు, 1090 ప‌రుగులు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement