వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. బుధవారం కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్‌కు అహ్హనించాడు.
దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ పతుమ్ నిస్సాంక (79 పరుగులు, 103 బంతుల్లో), వికెట్ కీపర్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (72 పరుగులు, 62 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. చరిత్ అసలంక(45), జనిత్ లియాంగే(44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్, ఛేజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 49.2 ఓవర్లలో 262 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షాయ్ హోప్ (56) , గ్రీవ్స్(45) రాణించగా, మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లంక పేసర్ దుష్మంత చమీర 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు తీక్షణ రెండు, హసరంగ, అసలంక తలా వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్లు రెండో వన్డే ఇదే వేదికలో ఆదివారం జరగనుంది.
చదవండి: సూర్యకుమార్‌కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా తెలుగోడు!


