AUS vs IND: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌! మరి రోహిత్‌?

Kohli, Pandya, Rohit, Bumrah to rest during IND vs AUS ODI series: Reports - Sakshi

ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. సెప్టెంబర్‌ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఈ సిరీస్‌ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టును కూడా ప్రకటించింది. ఇక భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సోమవారం ప్రకటించనుంది.

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌.. రోహిత్‌, విరాట్‌కు విశ్రాంతి
ఇక ఈ సిరీస్‌కు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఆసీస్‌ సిరీస్‌లో భారత జట్టు పగ్గాలు స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు అప్పజెప్పాలని సెలక్టర్లు నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది.

యువ ఆటగాళ్లు జైశ్వాల్‌, తిలక్‌ వర్మ, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లకు క​ంగరూలతో వన్డే సిరీస్‌కు అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అందుబాటుపై కూడా సందేహం నెలకొంది. అక్షర్‌ పటేల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. అతడి స్ధానంలో వాషింగ్టన్‌ సుందర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

ఆసీస్‌ సిరీస్‌కు భారత జట్టు(అంచనా): కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా,వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్,మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌కు ఊహించని షాక్‌.. స్టార్‌ ఓపెనర్‌ దూరం!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top