ర‌హానేపై వేటు.. కేకేఆర్‌కు కొత్త కెప్టెన్‌!? | KKR Told To Drop Ajinkya Rahane As India Great Suggests New Captain | Sakshi
Sakshi News home page

IPL 2026: ర‌హానేపై వేటు.. కేకేఆర్‌కు కొత్త కెప్టెన్‌!?

Apr 17 2026 5:42 PM | Updated on Apr 17 2026 7:02 PM

KKR Told To Drop Ajinkya Rahane As India Great Suggests New Captain

ఐపీఎల్‌-2026లో మూడు సార్లు ఛాంపియ‌న్ కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి.  ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్ బోణీ కొట్టలేదు. 5 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ నాలుగింట ఓట‌మి చ‌విచూడగా.. మ‌రో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రద్దు అయింది. దీంతో కోల్‌క‌తా జ‌ట్టు ప్ర‌స్తుతం  పాయింట్ల ప‌ట్టిక‌లో అట్టడుగున నిలిచింది.

ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య ర‌హానేపై తీవ్ర‌స్ధాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌హానే వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా ఫ‌ర్వాలేద‌న్పిస్తున్న‌ప్ప‌టికి, కెప్టెన్సీ ప‌రంగా జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించ‌లేక‌పోతున్నాడు. తాజాగా ర‌హానే కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ క్రిష్ణ‌మ‌చారి శ్రీకాంత్ నిప్పులు చెరిగాడు. 

ర‌హానేను త‌ప్పించి కేకేఆర్ జ‌ట్టు ప‌గ్గాల‌ను స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ అప్ప‌గించాల‌ని శ్రీకాంత్ సూచించాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌హానే ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు 152 ప‌రుగులు సాధించాడు. అయితే ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత త‌న దూకుడును ర‌హానే కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు.

"రహానేకు మరో ఒకటి లేదా రెండు అవకాశాలు ఇవ్వండి. అప్పటికీ మార్పు రాకపోతే అతడిని జట్టు నుంచి తప్పించి, సీజ‌న్ మ‌ధ్య‌లోనే సునీల్ నరైన్‌ను కెప్టెన్ చేయండి. రహానే అవసరం ఉంటేనే దిగాలి. లేదంటే అత‌డు కేవ‌లం కెప్టెన్‌గా మాత్రమే వ్యవహరించాలి. ఓపెన‌ర్‌గా స‌క్సెస్ కాలేక‌పోతున్నాడు. 

పవర్‌ప్లే తర్వాత పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మిడిలార్డ‌ర్‌కు కూడా స‌రిపోడు. అసలు రహానేను కెప్టెన్ చేయడమే తప్పుడు నిర్ణ‌యం. కానీ ఇప్పుడు సీజ‌న్ మ‌ధ్య‌లో తొలగించే ధైర్యం మేనేజ్‌మెంట్‌కు ఉందా?  కేకేఆర్ ఫిన్ అలెన్‌, కామెరాన్ గ్రీన్‌ల‌ను కూడా జ‌ట్టు నుంచి త‌ప్పించాలి.

వారిద్ద‌రి స్ధానంలో రచిన్ రవీంద్ర, పతిరానాలకు అవ‌కాశ‌మివ్వాలి. అప్పుడు ర‌చిన్ ర‌వీంద్ర‌, ర‌హానేలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించవ‌చ్చు. టీమ్ కాంబనేష‌న్ బ్యాలన్స్‌డ్‌గా ఉంటుంది. కేకేఆర్ ఆట‌గాళ్ల కంటే వారి స‌పోర్ట్ స్టాపే మెరుగ్గా క‌నిపిస్తున్నారు" అని శ్రీకాంత్ ఎద్దేవా చేశాడు. కాగా కేకేఆర్ శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్ట‌నుంది.
చదవండి: IPL 2026: వ‌రుస ఓట‌ములు.. హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న నిర్ణ‌యం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement