IPL 2023: అ‍య్యో విలియమ్సన్‌.. నిలబడేందుకు కూడా కష్టం! వరల్డ్‌కప్‌కు అనుమానమే

Kane Williamson Leaves IPL 2023 After Knee Injury,  - Sakshi

న్యూజిలాండ్‌ కెప్టెన్‌, గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బంతిని ఆపబోయి కేన్‌ మామ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మెకాలికి గాయమైంది.

ఇక ఐపీఎల్‌కు దూరమైన  విలియమ్సన్‌ తన స్వదేశానికి పయనమయ్యాడు. అయితే న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు విలియమ్సన్‌ ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. మోకాళ్లకి కట్టుతో క్రట్చెస్ (ఊత కర్రలు) సాయంతో నిలబడి థమ్సప్ చూపిస్తున్న ఫోటోను అభిమానులతో కేన్‌ పంచకున్నాడు.

"థ్యాంక్యూ గుజరాత్ టైటాన్స్. ఈ కొద్ది రోజుల్లో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను కలిశాను. గత కొన్ని రోజులుగా నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను నా స్వదేశానికి వెళ్తున్నా, త్వరలో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను" అని ఇన్‌స్టాలో విలియమ్సన్‌ పేర్కొన్నాడు. కాగా భారత్‌లో కేన్‌ మామకు పత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

ఈ ఫోటో అతడి అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. కేన్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు అశిస్తున్నారు. ఇక విలియమ్సన్‌ పోస్టుపై ఈ సురేష్ రైనా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రుతురాజ్ గైక్వాడ్, తదితర క్రికెటర్లు సైతం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేశారు. కాగా  మెకాలి గాయంతో బాధపడుతున్న విలియమ్సన్‌ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో అతడు భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌-2023లో పాల్గొనడం అనుమానంగా మారింది.
చదవండిIPL 2023: ఏంటి సిరాజ్‌ ఇది.. కొంచెం చూసి వెళ్లవచ్చు కదా! పాపం కార్తీక్‌! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top