‘అందుకే ధోనికి బిగ్‌ ఫ్యాన్‌ అయ్యా’

Jos Buttler Recalls Fan Of MS Dhoni - Sakshi

దుబాయ్‌: తాను టీమిండియా మాజీ కెప్టెన్‌, సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి పెద్ద ఫ్యాన్‌ అని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన ఇంగ్లండ్‌ ఆటగాడు, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌.. అసలు ధోనికి ఎందుకు అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వెల్లడించాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్లర్‌ మాట్లాడుతూ..‘ మైదానంలో ధోని ప్రవర్తన అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా అతని కూల్‌ అండ్‌ కామ్‌ అనేది నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ అంటే ఇంకా ఇష్టం. ప్రత్యేకంగా ధోని ఆడే హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువగా ప్రేమిస్తా. నేను ఎప్పుడూ ఐపీఎల్‌ను టీవీలో చూస్తూ ఉండేవాడిని. ధోని చాలా గుర్తుండుపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు. (వరుసగా శతకాలు.. వరుసగా డక్‌లు!)

ఐపీఎల్‌లో ఎన్నో విజయాల్ని ధోని సాధించాడు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ధోని మ్యాచ్‌ను ఫినిష్‌ చేసిన విధానం సూపర్‌. ఆ ఫైనల్‌ మ్యాచ్‌ను ఇంటిదగ్గరే ఉండి వీక్షించా. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు ధోని. అది నిజంగా ఇప్పటికీ నాలో మెదులుతూనే ఉంది. ఆ సిక్స్‌ ఎప్పుడూ ప‍్రతిధ్వనిస్తూనే ఉంది’ అని ధోనికి అభిమానిని అవ్వడానికి గల కారణాలను బట్లర్‌ వెల్లడించాడు.  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన రెండో అంచె మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌కు ఎంఎస్‌ ధోని నుంచి బహుమతి లభించింది.  తన 200 వ ఐపీఎల్‌ మ్యాచ్‌ జెర్సీని బట్లర్‌కు ఇచ్చాడు ధోని. ప్రపంచ వ్యాప్తంగా ధోనికి ఎంతోమంది అభిమానులు ఉండగా అందులో బట్లర్‌ ఒకడు. తన ఫేవరెట్‌ క్రికెటరే కాకుండా ఆరాథ్య క్రికెటర్‌ ధోని అంటూ గతంలో చాలా సార్లు చెప్పాడు బట్లర్‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top