రాజస్తాన్‌ గెలుపు బాట.. లక్నోపై ఘన విజయం | Jofra Archer stars as Rajasthan defend 159 against lacklustre Lucknow | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్తాన్‌ గెలుపు బాట.. లక్నోపై ఘన విజయం

Apr 22 2026 11:34 PM | Updated on Apr 22 2026 11:34 PM

Jofra Archer stars as Rajasthan defend 159 against lacklustre Lucknow

ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక లక్నో చతికలపడింది. పంత్ సేన లక్ష్య చేధనలో 18 ఓవర్లలో 119  పరుగులకే ఆలౌటైంది.

రాజస్తాన్‌  బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement