అండర్సన్ అదరహో

కెరీర్‌లో 30వసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్
శ్రీలంక 381 ఆలౌట్
గాలె: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (6/40) గాలెలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 229/4తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 381 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ (110; 11 ఫోర్లు), డిక్‌వెలా (92; 10 ఫోర్లు) వికెట్లను దక్కించుకున్న అండర్సన్ కెరీర్‌లో 30వసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను దక్కించుకున్నాడు. తర్వాత సురంగ లక్మల్ (0)ను పెవిలియన్ పంపించి ఈ మైదానంలో తన అత్యుత్తమ ప్రదర్శన (2012లో; 5/75)ను సవరించడంతో పాటు, ఉపఖండంలో 5 వికెట్లు దక్కించుకున్న పెద్ద వయస్కుడిగా 38 ఏళ్ల అండర్సన్ ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ (37 ఏళ్లు) పేరిట ఉండేది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 30 ఓవర్లలో 2 వికెట్లకు 98 పరుగులు చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి