ఇంగ్లండ్ జట్ల ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్లకు నో ప్లేస్‌ | Jacob Bethell, Phil Salt Ruled Out In England Squad For Sri Lanka Series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జట్ల ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్లకు నో ప్లేస్‌

Sep 4 2026 11:11 PM | Updated on Sep 4 2026 11:11 PM

Jacob Bethell, Phil Salt Ruled Out In England Squad For Sri Lanka Series

source: X

త్వరలో శ్రీలంకతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వేర్వేరు ఇంగ్లండ్‌ జట్లను ఇవాళ ప్రకటించారు. ఇరు జట్లకు (టీ20, వన్డే) హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, బెన్ డకెట్, విల్ జాక్స్ వంటి కీలక ఆటగాళ్లకు రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కింది.

బేతెల్‌, సాల్ట్‌ ఔట్‌
ఈ జట్లలో విధ్వంసకర బ్యాటర్లు జేకబ్‌ బేతెల్‌, ఫిల్‌ సాల్ట్‌కు చోటు దక్కలేదు. గాయాల కారణంగా వీరిద్దరూ ఈ సిరీస్‌లకు దూరమయ్యారు.

డొనాల్డ్‌, క్రోకోంబ్‌కు తొలి అవకాశాలు
డెర్బీషైర్ బ్యాటర్ అనెరిన్ డొనాల్డ్ తొలిసారి ఇంగ్లండ్ టీ20 జట్టులో చోటు సంపాదించాడు. 2026 టీ20 బ్లాస్ట్‌లో అతను అద్భుత ప్రదర్శన చేశాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 230.66 స్ట్రైక్‌రేట్‌తో 489 పరుగులు సాధించాడు. తాజాగా వరుస హ్యాట్రిక్‌లతో సంచలనం సృష్టించిన ససెక్స్‌ పేసర్‌ హెన్రీ క్రోకోంబ్‌కు వన్డే జట్టులో తొలిసారి అవకాశం లభించింది.

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్‌ జరుగనుంది. టీ20లు సెప్టెంబర్‌ 15, 17, 19 తేదీల్లో సౌతాంప్టన్‌, కార్డిఫ్‌, మాంచెస్టర్‌ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో చెస్టర్‌ లీ స్ట్రీట్‌, హెడింగ్లే, కెన్నింగ్టన్‌ ఓవల్‌లో జరుగనున్నాయి.

ఇంగ్లండ్ టీ20 జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, లియామ్ డాసన్, అనెరిన్ డొనాల్డ్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహ్మూద్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.

ఇంగ్లండ్ వన్డే జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, సోనీ బేకర్, జోస్ బట్లర్, జోర్డాన్ కాక్స్, హెన్రీ క్రోకోంబ్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.

చదవండి: తృటిలో మరో పరాభవాన్ని తప్పించుకున్న సౌతాఫ్రికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement