ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్‌ కన్నుమూత

Italy Legendary Football Player Paolo Rossi Passed Away - Sakshi

మిలన్‌ : ఫుట్‌బాల్‌ ప్రపంచానికి మరో షాక్‌ తగిలింది. డీగో మారడోనా విషాదం మరవక ముందే మరో దిగ్గజ ఆటగాడు కన్నూమూశాడు. అతనే ఇటలీ దిగ్గజ ఫుట్‌ బాలర్‌ పాలో రోసి(64). ఆయన మరణవార్తను భార్య ఫెడెరికా కాపెల్లేటి ఇన్‌స్టాగ్రామ్‌లో దృవీకరించారు. 'రోసి.. మిస్‌ యూ ఫర్‌ ఎవర్‌'అని ఉద్వేగభరితమైన పోస్టు చేసింది.1982లో జరిగిన ప్రపంచకప్‌లో ఇటలీ జగజ్జేతగా నిలవడంలో పాలో రోసి కీలకపాత్ర పోషించాడు.

ఆ ప్రపంచకప్‌లో పాలో రోసి 6 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా గోల్డెన్‌ బూట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా గోల్డన్‌ బాల్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఒక ప్రపంచకప్‌లో టైటిలతో పాటు గోల్డెన్‌ బూట్, గోల్డన్‌ బాల్ గెలుచుకున్న ముగ్గురిలో ఒకరిగా నిలవడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top