Ishan Kishan: ఐపీఎల్‌ 2021లో ఇషాన్‌ కిషన్‌ రికార్డు.. ఇది రెండోసారి | Ishan Kishan Fastest Fifty IPL 2021 Season Overall 2nd Time For MI | Sakshi
Sakshi News home page

Ishan Kishan: ఐపీఎల్‌ 2021లో ఇషాన్‌ కిషన్‌ రికార్డు.. ఇది రెండోసారి

Oct 8 2021 8:12 PM | Updated on Oct 8 2021 8:40 PM

Ishan Kishan Fastest Fifty IPL 2021 Season Overall 2nd Time For MI - Sakshi

Ishan Kishan Fastest Fifty IPL 2021.. ఐపీఎల్‌ 2021లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ కొత్త రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్‌సెంచరీ మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఇషాన్‌ 16 బంతుల్లోనే 8 ఫోర్లు.. 2 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంతకముందు ఇదే సీజన్‌లో పొలార్డ్‌(ముంబై ఇండియన్స్‌) 17 బంతుల్లో ఫిఫ్టీ సాధించి రెండో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా (18 బంతుల్లో 50 పరుగులు) మూడో స్థానంలో.. యశస్వి జైశ్వాల్‌(19 బంతుల్లో 50 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇక ముంబై ఇండియన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ ఫిప్టీ సాధించడం ఇషాన్‌కు ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న ఇషాన్‌ తాజా సీజన్‌లో 16 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత పొలార్డ్‌ ( 2016లో 17 బంతులు వర్సెస్‌ కేకేఆర్‌), హర్దిక్‌ పాండ్యా( 2019లో 17 బంతులు వర్సెస్‌ కేకేఆర్‌), పొలార్డ్‌(2021లో 17 బంతులు వర్సెస్‌ సీఎస్‌కే) ఉన్నారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ధాటిగా ఆడుతుంది. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 95 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 75, హార్దిక్‌ పాండ్యా 2 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement