కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ | IPL 2026: kolkata knight riders vs rajasthan royals live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Apr 19 2026 3:01 PM | Updated on Apr 19 2026 6:31 PM

IPL 2026: kolkata knight riders vs rajasthan royals live updates

IPL 2026 KKR vs RR Live updates: ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.

కేకేఆర్‌ ఐదో వికెట్‌ డౌన్‌
70 పరుగుల వద్ద కేకేఆర్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పావెల్‌.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్‌ విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి. 11 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 74/5
కేకేఆర్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 ప‌రుగులు చేసిన ర‌ఘువంశీ.. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వ‌చ్చాడు.

కేకేఆర్‌ మూడో వికెట్‌ డౌన్‌
37 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన కామెరూన్‌ గ్రీన్‌.. రవి బిష్ణయ్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.

కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానే(0) మరోసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్‌
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

చెలరేగిన కేకేఆర్‌ బౌలర్లు.. రాజస్తాన్‌ స్కోరెంతంటే?
ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ(46) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జైశ్వాల్‌(39) రాణించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో కార్తీక్‌ త్యాగి, వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. సునీల్‌ నరైన్‌ రెండు వికెట్లు సాధించాడు.

ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు
18 ఓవర్‌ వేసిన కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత రవీంద్ర జడేజా(9), షిమ్రాన్‌ హెట్‌మైర్‌(15), బిష్ణోయ్(0) ఔటయ్యాడు.

రాజ‌స్తాన్ ఐదో వికెట్ డౌన్‌
124 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన ఫెరీరా..  సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌
117 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్తాన్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన రియాన్ ప‌రాగ్‌.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

రాజస్తాన్‌ మూడో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ వచ్చాడు. 13 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 109/3

రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
97 పరుగుల వద్ద రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ధ్రువ్‌ జురుల్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
81 పరుగుల వద్ద రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్‌ జురెల్‌ వచ్చాడు.

6 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 63/0
6 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్‌ సూర్యవంశీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), యశస్వి జైశ్వాల్‌(21) ఉన్నారు.

3 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 20/0
3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్‌ సూర్యవంశీ(11), యశస్వి జైశ్వాల్‌(9) ఉన్నారు.

ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్‌మైర్‌, బ్రిజేష్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. కేకేఆర్‌ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తి

ఇంపాక్ట్ సబ్‌లు: మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ

రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్

ఇంపాక్ట్ స‌బ్స్‌: సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా

Advertisement
 
Advertisement
Advertisement