
PC: BCCI/IPL.com
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు కాస్త చల్లారడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. మే 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ కానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించి, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఈ ఏడాది సీజన్‌కు ముగింపు పలకాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శర్మ..
ఇక ఇది ఇలా ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా కనీసం ఒక మ్యాచ్‌కైనా దూరమయ్యే అవకాశముంది. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాటిదార్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడికి రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అతడు కనీసం రెండు మ్యాచ్‌లకైనా దూరమవుతాడని అంతా భావించారు.
కానీ ఐపీఎల్-2025లో మధ్యలోనే ఆగిపోవడంతో ఆర్సీబీకి కలిసొచ్చింది. అతడు చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఒకవేళ ఐపీఎల్-2025 మే 15 నుంచి తిరిగి ప్రారంభమైతే.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ కానున్నాడు. పాటిదార్ గైర్హజరీలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఆర్సీబీ జట్టును నడిపించనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని జితేష్ శర్మ ధ్రువీకరించాడు.
"లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో కెప్టెన్‌గా నాకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి చాలా గొప్ప విషయం. దేవదత్ పడిక్కల్, రజిత్ పాటిదార్ ఇద్దరూ అందుబాటులో లేనందున, వారిస్ధానాలను ఎవరితో భర్తీ చేయాలని నేను ఆలోచిస్తున్నాను.
నాకు నిజంగా ఇది చాలా పెద్ద బాధ్యత" అని ఐపీఎల్ సస్పెన్షన్‌కు ముందు జితేష్ శర్మ ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ మే 15న ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాకపోతే కెప్టెన్సీ అవకాశాన్ని జితేష్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
చదవండి: ENG vs IND: రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్‌కు తిరుగులేదు?