
PC: BCCI/IPL.com
IPL 2025 GT vs SRH Live updates: ఐపీఎల్-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి.
గుజరాత్ ఘన విజయం
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(49), రూథర్ ఫర్డ్(35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్ ఒక వికెట్ సాధించాడు.
గుజరాత్ మూడో వికెట్ డౌన్..
వాషింగ్టన్ సుందర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన సుందర్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
10 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 82/2
10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(40), శుబ్‌మన్ గిల్(36) పరుగులతో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న గుజరాత్..
7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(29), శుబ్‌మన్ గిల్(21) ఉన్నారు.
గుజరాత్ రెండో వికెట్ డౌన్..
జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(19), సుందర్(3) ఉన్నారు.
గుజరాత్‌కు భారీ షాక్..
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాయిసుదర్శన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది.
ఎస్ఆర్‌హెచ్ స్కోరంతంటే?
ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(27),కమ్మిన్స్(22) రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మరోసారి సత్తాచాటాడు. సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఎస్ఆర్‌హెచ్ ఆరో వికెట్ డౌన్..
ఎస్ఆర్‌హెచ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్‌గా నితీష్ కుమార్ రెడ్డి(31), ఆరో వికెట్‌గా కమిందు మెండిస్(1) పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్
హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన క్లాసెన్.. సాయిశ్రీనివాస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ డౌన్
ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కిషన్.. ప్రసిద్ద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(5), నితీశ్ కుమార్ రెడ్డి(8) ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్
అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన అభిషేక్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న కిషన్, అభిషేక్
4 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(11), అభిషేక్ శర్మ(18) ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్.. హెడ్ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. 8 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ఇషాన్ కిషన్ వచ్చాడు.
ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. అర్షద్ ఖాన్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు. సిమర్జీత్ సింగ్ స్దానంలో జయదేవ్ ఉనద్కట్ వచ్చాడు. ఎస్ఆర్‌హెచ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ