కళ్లు చెదిరే యార్కర్‌ వేసిన బుమ్రా.. పృథ్వీ షాకు ఫ్యూజులు ఔట్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 MI VS DC: కళ్లు చెదిరే యార్కర్‌ వేసిన బుమ్రా.. పృథ్వీ షాకు ఫ్యూజులు ఔట్‌

Published Sun, Apr 7 2024 6:54 PM

IPL 2024 MI VS DC: Prithvi Shaw Clean Bowled By Bumrah Super Yorker - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తనదైన శైలిలో కళ్లు చెదిరే యార్కర్‌ సంధించాడు. ఈ బంతిని ఎదుర్కోలేక బ్యాటర్‌ పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బుమ్రా వేసిన ఈ సూపర్‌ యార్కర్‌కు షా వద్ద సమాధానం లేకుండా పోయింది. అతనితో సహా మ్యాచ్‌ చూస్తున్న వారందరికీ ఈ యార్కర్‌ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో షా అద్భుతమైన టచ్‌లో ఉన్నప్పుడు బుమ్రా తన మార్కు మ్యాజిక్‌ చేశాడు. ఫలితంగా ఢిల్లీ కష్టాల్లో పడింది. బుమ్రా సూపర్‌ యార్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టంట వైరలవుతుంది. షాను ఔట్‌ చేసిన అనంతరం బుమ్రా మరోసారి విజృంభించాడు. 15వ ఓవర్‌ ఆఖరి బంతికి అభిషేక్‌ పోరెల్‌ను (41) కూడా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఢిల్లీ కష్టాలు తీవ్రమయ్యాయి. 15 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్‌ 144/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే 30 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. ట్రిస్టన్‌  స్టబ్స్‌ (26), రిషబ్‌ పంత్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్‌లో షెపర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement