IPL 2023 LSG Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో ఘన విజయం

IPL 2023: Lucknow Super Giants Vs Delhi Capitals Live Updates - Sakshi

లక్నో సూపర్‌జెయింట్స్‌ శుభారంభం
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ శుభారంభం చేసింది. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 50 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.  194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రిలీ రొసౌ 30 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో మార్క్‌ వుడ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ కైల్‌ మేయర్స్‌ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 38 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. నికోలస్‌ పూరన్‌ 36 పరుగులతో రాణించాడు. చివర్లో ఆయుష్‌ బదోని ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియాలు చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

వార్నర్‌ అర్థశతకం..  అయినా కష్టమే
► 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ అర్థశతకం మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం వార్నర్‌ 56, అమన్‌ హకీమ్‌ ఖాన్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 29 బంతుల్లో 82 పరుగులు చేయాలి.

9 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 58/3
► 9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. వార్నర్‌ 32, రొసౌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టార్గెట్‌ 194.. ఢిల్లీ స్కోరు ఎంతంటే?
► 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 27, సర్ఫరాజ్‌ ఖాన్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ 194
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 38 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. నికోలస్‌ పూరన్‌ 36 పరుగులతో రాణించాడు. చివర్లో ఆయుష్‌ బదోని ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియాలు చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.


Photo Credit : IPL Website

16 ఓవర్లలో లక్నో 131/4
► 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. పూరన్‌ 12, కృనాల్‌ పాండ్యా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. 


Photo Credit : IPL Website

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో
► 38 బంతుల్లోనే 73 పరుగులతో విరుచుకుపడిన కైల్‌ మేయర్స్‌ ఇన్నింగ్స్‌కు అక్షర్‌ పటేల్‌ చెక్‌ పెట్టాడు. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.


Photo Credit : IPL Website

విరుచుకుపడుతన్న మేయర్స్‌.. 8 ఓవర్లలో 60/1
► విండీస్‌ హిట్టర్‌ కైల్‌ మేయర్స్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. మేయర్స్‌ 42, దీపక్‌ హుడా 9 పరుగులతో ఆడుతున్నారు.

3 ఓవర్లలో లక్నో స్కోరు 12/0
► మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 9, కేఎల్‌ రాహుల్‌ 2 పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శనివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మొదలైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఏంచుకుంది. 

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2023 సీజన్ ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది..

ఐపీఎల్ 2023 వేలంలో నికోలస్ పూరన్‌ కోసం ఏకంగా రూ.16 కోట్లు పెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన పూరన్‌కి ఇంత ఖర్చు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈసారి లక్నోలో పూరన్ పర్ఫామెన్స్‌పైనే అందరి దృష్టి పడనుంది..

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్‌ కీపర్‌), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top