
PC: IPL Twitter
Bio-input Resource Centres (BRC) ప్రకృతి వ్యవసాయానికి ఉప�...
రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరు...
పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ త�...
ఒరిగామిపై 1988లో ఆసక్తి పెంచుకున్న రవి ...
కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బ�...
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని �...
‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్...
నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్‌ఫండ్...
లింగ సమానత్వం కార్పొరేట్ రంగాల్లో క...
వైశాఖ శుద్ధ తదియ lనే అక్షయ తృతీయగా జరు...
హైదరాబాద్ తెలంగాణలో వేసవి ముదురు�...
ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన...
ఎన్నో రకాల కేక్‌లు చూసుంటారు. కానీ ఇల�...
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగ�...
మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కర�...
Published Wed, May 4 2022 7:09 PM | Last Updated on Wed, May 4 2022 11:04 PM
PC: IPL Twitter
IPL 2022: ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
ఐపీఎల్ 2022లో భాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవన్ కాన్వే 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మొయిన్ అలీ 34 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2, హాజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 34 పరుగులు చేసిన మొయిన్ అలీ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 34 పరుగులు చేసిన మొయిన్ అలీ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
సీఎస్కే 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ ఆలీ(21), రవీంద్ర జడేజా(3) ఉన్నారు.
సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. డుప్లెసిస్ 38, కోహ్లి 30 పరుగులు చేశారు. ఆఖర్లో దినేశ్ కార్తిక్ 17 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో మహీష్ తీక్షణ 3, మొయిన్ అలీ 2, ప్రిటోరియస్ ఒక వికెట్ తీశాడు.
సీఎస్కే బౌలర్ మహీష్ తీక్షణ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ తీశాడు. తొలుత 42 పరుగులు చేసిన లామ్రోర్‌ను ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాతి బంతికే హసరంగాను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక చివరి బంతికి షాబాజ్ అహ్మద్‌ను ఒక్క పరుగుకే ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
రజత్ పాటిదార్(21) రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిటోరియస్ బౌలింగ్‌లో ముకేశ్ చౌదరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 21, దినేశ్ కార్తిక్ క్రీజులో ఉన్నారు.
సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన డుప్లెసిస్ మొయిన్ అలీ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. కోహ్లి 22 పరుగులతో ఆడుతున్నాడు.
సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. కోహ్లి 11, డుప్లెసిస్ 7 పరుగులతో ఆడుతున్నారు.
ఐపీఎల్ 2022లో బుధవారం ఆర్సీబీ, సీఎస్కే మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు... ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. సీఎస్కే తొమ్మిది మ్యాచ్‌ల్లో 3 విజయాలు.. ఆరు పరాజయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
గత మ్యాచ్‌లో సీఎస్కే విజయం ద్వారా తిరిగి ఫామ్‌లోకి రాగా.. ఆర్సీబీ మాత్రం వరుసగా పరాజయాలు మూటగట్టుకుంది. ఇక ఇరుజట్లు 29 సార్లు తలపడగా.. సీఎస్కే 20సార్లు గెలుపొందగా.. ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు చవిచూసింది.