Breadcrumb
Live Updates
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
రసెల్ విధ్వంసం.. పంజాబ్‌పై కేకేఆర్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రసెల్ (31 బంతుల్లో 70, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ మెరుపులు మెరిపించాడు. సిక్సర్ల వర్షంతో లక్ష్యం చిన్నదిగా మారిపోయింది. అతనికి తోడుగా సామ్ బిల్లింగ్స్ కూడా 24 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ 2 వికెట్లు, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్ తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. బానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రబాడ 16 బంతుల్లో 25 రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, సౌథీ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు.
దంచుతున్న రసెల్.. లక్ష్యం దిశగా కేకేఆర్
కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తుండడంతో కేకేఆర్ స్కోర్‌బోర్డు పరుగులెత్తుతుంది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రసెల్ 44, సామ్ బిల్లింగ్స్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 56/4
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తడబడుతోంది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. రసెల్ 2, సామ్ బిల్లింగ్స్ 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 26 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తన తర్వాతి బంతికే నితీష్ రాణాను రాహుల్ చహర్ డకౌట్ చేశాడు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
అజింక్య రహానే(12) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఓడియన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ 137 ఆలౌట్
కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. బానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రబాడ 16 బంతుల్లో 25 రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, సౌథీ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు.
ఉమేశ్ యాదవ్ దెబ్బ.. 8వ వికెట్ కోల్పోయిన పంజాబ్
కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తన రెండో స్పెల్‌లో మరోసారి విజృంభించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి హర్‌ప్రీత్ బార్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఉమేశ్.. నాలుగో బంతికి రాహుల్ చహర్‌ను డకౌట్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 102 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 15 ఓవర్లలో 102 పరుగులు చేసింది.
85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అండర్-19 కుర్రాడు రాజ్ బవా(11) సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
8 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 70/3
8 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ 14, రాజ్ బవా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 16 పరుగులు చేసిన ధావన్ సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు
5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 51/1
5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 12, లియామ్ లివింగ్ స్టోన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 9 బంతుల్లో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బానుక రాజపక్స శివమ్ మావి బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఒక పరుగు చేసిన మయాంక్ అగర్వాల్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కేకేఆర్ .. ఆర్సీబీతో జరిగిన రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మరోవైపు ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించి బోణీ కొట్టింది.
ఇక ఇరుజట్లు ఇప్పటివరకు 29సార్లు తలపడగా.. కేకేఆర్ 19సార్లు.. పంజాబ్ 10సార్లు విజయాలు సాధించాయి. గత సీజన్లో ఇరుజట్లు రెండో సార్లు పోటీపడగా.. కేకేఆర్, పంజాబ్ చెరో విజయాన్ని అందుకున్నాయి.
Related News By Category
Related News By Tags
-
IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం పంజాబ్ కింగ్స్ నిలకడలేని ఫామ్‌ను ఎత్తి చూపుతోంది. ఇప్పటిదాకా జరిగిన మొత్తం 18 సీజన్లలో ఈ జట్టు రెండుసార్లు (2014, 2025) మాత్రమే ఫైనల్‌కు వచ్చింది...
-
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్
ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సం...
-
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జర...
-
24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా?
భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ...
-
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే ...


