Breadcrumb
Live Updates
IPL 2022: లక్నోవర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
పంజా విసిరిన లక్నో పేసర్లు.. కేకేఆర్‌కు మరో ఘోర పరాభవం
జేసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కేకేఆర్ చివరి మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని పరిపూర్ణం చేసుకుంది. తొలుత సునీల్ నరైన్ (22) కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటవగా, ఆమరుసటి బంతికే సౌథీ (0) ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మూడో బంతికి హర్షిత్ రాణా (1) రనౌటవ్వడంతో కేకేఆర్ ఇన్నింగ్ప్ 101 పరుగుల వద్ద ముగిసింది.
ఫలితంగా లక్నో 75 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రసెల్ (45), నరైన్ (22), ఫించ్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. లక్నో బౌలర్లలో హోల్డర్, ఆవేశ్ ఖాన్ చెరో మూడు వికెట్లు .. చమీరా, మోహిసిన్ ఖాన్, బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌథీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి హోల్డర్ (13)ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి చమీరా (0) రనౌటయ్యాడు. లక్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (50), హుడా (41), స్టోయినిస్ (28) రాణించగా.. కేకేఆర్ బౌలర్లలో రసెల్ 2, సౌథీ, శివమ్ మావి, నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకోవడంతో అనుకూల్ రాయ్ (0) పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా కేకేఆర్ 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 88/7. నరైన్ (11), శివమ్ మావి (1) క్రీజ్‌లో ఉన్నారు.
హోల్డర్ సూపర్ క్యాచ్.. రసెల్ ఔట్
భారీ షాట్లతో విరుచుకుపడుతూ కేకేఆర్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేసిన రసెల్ (19 బంతుల్లో 45) ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాటపట్టాడు.
69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కేకేఆర్
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రింకూ సింగ్ (6).. కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా కేకేఆర్ 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 79/5. రసెల్ (17 బంతుల్లో 39), నరైన్ (10) క్రీజ్‌లో ఉన్నారు.
రసెల్ వీరవిహారం
25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న కేకేఆర్‌ను ఆండ్రీ రసెల్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హోల్డర్ వేసిన 9వ ఓవర్లో 3 సిక్సర్లు, ఫోర్ బాదిన రసెల్.. ఆతర్వాత బిష్ణోయ్ వేసిన 10వ ఓవర్లోనూ ఓ సిక్సర్ బాది కేకేఆర్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 69/4. రింకూ సింగ్ (6), రసెల్ (17 బంతుల్లో 39) క్రీజ్‌లో ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్.. 25 పరుగులకే 4 వికెట్లు డౌన్
వరుసగా వికెట్లు కోల్పోతున్న కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ఆవేశ్ ఖాన్ వేసిన 7వ ఓవర్ ఐదో బంతికి నితీశ్ రాణా (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 25/4. రింకూ సింగ్ (1), రసెల్ క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. హోల్డర్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ (14) పెవిలియన్ బాట పట్టాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 25/3. రింకూ సింగ్ (1), నితీశ్ రాణా (20 క్రీజ్‌లో ఉన్నారు.
కేకేఆర్‌కు భారీ ఎదురుదెబ్బ.. శ్రేయస్ ఔట్
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌కు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6).. 3.4వ ఓవర్లో పెవిలియన్‌కు చేరాడు. చమీరా బౌలింగ్‌లో బదోనికి క్యాచ్ ఇచ్చి శ్రేయస్ పెవిలియన్ బాట పట్టాడు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 11/2. ఫించ్ (4), నితీశ్ రాణా క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన కేకేఆర్
మోహిసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లోనే కేకేఆర్ వికెట్ కోల్పోయింది. అయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి బాబా ఇంద్రజిత్ (0) ఔటయ్యాడు.
ఆఖరి ఓవర్ కట్టుదిట్టంగా బౌల్ చేసిన సౌథీ.. ఓ మోస్తరు స్కోర్ చేసిన లక్నో
టిమ్ సౌథీ ఆఖరి ఓవర్ కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌథీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి హోల్డర్ (13)ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి చమీరా (0) రనౌటయ్యాడు. లక్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (50), హుడా (41), స్టోయినిస్ (28) రాణించగా.. కేకేఆర్ బౌలర్లలో రసెల్ 2, సౌథీ, శివమ్ మావి, నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
స్టోయినిస్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
శివమ్ మావి బౌలింగ్‌లో హ్యట్రిక్ సిక్సర్లు బాదిన అనంతరం స్టోయినిస్ (14 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. స్టోయినిస్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన హోల్డర్ (2 బంతుల్లో 12; 2 సిక్సర్లు) వచ్చీ రాగానే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
నాలుగో వికెట్ డౌన్
రసెల్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా (27 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 123/4. బదోని (5), స్టోయినిస్ క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన లక్నో
భారీ స్కోర్ దిశగా సాగుతున్న దీపక్ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రసెల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 110/3. కృనాల్ పాండ్యా (15), బదోని (3) క్రీజ్‌లో ఉన్నారు.
10 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 90/2
రెండు వికెట్లు కోల్పోయాక కూడా లక్నో జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. దీపక్ హుడా (31), కృనాల్ పాండ్యా (8) భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 90/2.
విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ఔటైన డికాక్
లక్నో ఓపెనర్ డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ఔటయ్యాడు. 7.2వ ఓవర్లో నరైన్ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 76/2. క్రీజ్‌లో దీపక్ హుడా (25), కృనాల్ పాండ్యా (1) ఉన్నారు.
విరుచుకుపడుతున్న డికాక్, హుడా
లక్నో తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. డికాక్ (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), దీపక్ హుడా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్సర్) కేకేఆర్ బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. ఫలితంగా ఆ జట్టు స్కోర్ 6 ఓవర్ల తర్వాత 66/1గా ఉంది.
తొలి ఓవర్లోనే లక్నోకు షాక్.. రాహుల్ రనౌట్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో లక్నో కెప్టెన్‌ను డైమండ్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్ తర్వాత లక్నో స్కోర్ 2/1. క్రీజ్‌లో డికాక్ (2), దీపక్ హుడా ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఇవాళ (మే 7) లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: డికాక్ (వికెట్‌కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, స్టొయినిస్, అయుశ్ బదోని, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుశ్మంత చమీర, మోహిసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
కేకేఆర్: ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా , టిమ్ సౌథీ, శివమ్ మావి
Related News By Category
Related News By Tags
-
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్కే వెంకటేశ్ అయ్యర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 63.30 ...
-
నీ ఒంటికి వేరే జెర్సీ సూట్ అవ్వదు: షారుఖ్ ఖాన్ పోస్ట్ వైరల్
వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.....
-
ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2026 వేలానికి వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే క్యాష్ రిచ్ లీ...
-
IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఒకే జట్టుతో కొనసాగాడు. రూ. 20 లక్షల కనీస ధరతో ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను 2021లో కొనుగోలు ...
-
IPL 2026: ఎనిమిది మంది కెప్టెన్లు ఫిక్స్!.. మరి ఆ రెండు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్‌కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ...


