Breadcrumb
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
లక్నోను చిత్తు చేసిన గుజరాత్.. 62 పరుగుల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ ప్లేఆప్‌కు చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 82 పరుగులకే కుప్పకూలింది.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు, షమీ ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతుకుముందు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ (63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ రెండు, మోహిషన్ ఖాన్, హోల్డర్ తలా వికెట్ సాధించారు.
67 పరుగులకే ఏడు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో లక్నో
67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. లక్నో విజయానికి 48 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులో దీపక్ హుడా, మోహిషన్ ఖాన్ ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
61 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బదోని.. సాయి కిషోర్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోర్: 62/5
నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కృనాల్ పాండ్య.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
6 ఓవర్లకు లక్నో స్కోర్: 37/3
లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కరణ్ శర్మ.. యశ్ దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్: 37/3
రెండో వికెట్ కోల్పోయిన లక్నో
24 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్.. షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో
19 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన డికాక్.. యశ్ దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
3 ఓవర్లలో లక్నో 12/0
మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా లక్నో 12 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(5), కేఎల్ రాహుల్(7) పరుగులతో ఉన్నారు.
రాణించిన గిల్.. లక్నో టార్గెట్ 145 పరుగుల
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ (63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ రెండు, మోహిషన్ ఖాన్, హోల్డర్ తలా వికెట్ సాధించారు.
నాలగో వికెట్ కోల్పోయిన గుజరాత్
103 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన మిల్లర్.. హోల్డర్ బౌలింగ్‌లో బదోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు
15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 92/3
15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. క్రీజులో గిల్(47), మిల్లర్(18) పరుగులతో ఉన్నారు.
12 ఓవర్లకు 76/3
12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగులు సాధించింది.
11 ఓవర్లకు 69/3
11 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. గిల్ 39 పరుగులు, మిల్లర్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ డౌన్
పదమూడు బంతుల్లో పదకొండు పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్ డి కాక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 39/0
7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో గిల్(21), హార్ధిక్ పాండ్యా(3) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
24 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన వేడ్.. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 30/2
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
8 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సాహా.. మోహిసిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 7/0
2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. క్రీజులో గిల్(2), సాహా(5) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్-2022లో భాగంగా ఎంసీఎ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్
గుజరాత్ టైటాన్స్
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
Related News By Category
Related News By Tags
-
‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్లో పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ మొహసిన్ ఖాన్. కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 కంటే తక్కు...
-
IPL 2022 Playoffs: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో!
IPL 2022 Playoffs Qualification Scenarios In Telugu: ఐపీఎల్-2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడున ఉండగా.. డిఫె...
-
IPL 2022 Final: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్ మ్యాచ్ అప్పుడే!
IPL 2022- Final Match: ఐపీఎల్-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టైమ...
-
2009లో సచిన్.. 2022లో శుబ్‌మన్ గిల్ మాత్రమే
ఐపీఎల్ 2022 సీజన్లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని 18 పాయింట్లతో దర్జాగా ప్లే ...
-
టి20 క్రికెట్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత
ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ...