Breadcrumb
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ అప్డేట్స్
గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకుంది. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ మెరుగ్గా రాణించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. విరాట్ కోహ్లి 73 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. డుప్లెసిస్ 44 పరుగులు చేశాడు. చివర్లో మాక్స్వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో ధనాదన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. అయితే రన్‌రేట్ మైనస్‌లో ఉండడంతో.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతేనే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే మాత్రం రన్‌రేట్ ఆధారంగా ఆర్సీబీ ఇంటిబాట పట్టనుంది.
12 ఓవర్లలో ఆర్సీబీ 102/0
12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 56, డుప్లెసిస్ 40 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి, డుప్లెసిస్ మధ్య సీజన్లో తొలిసారి వంద పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
టార్గెట్ 169.. 6 ఓవర్లలో ఆర్సీబీ 55/0
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. కోహ్లి సీజన్లో తొలిసారి దూకుడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. కోహ్లి 34, డుప్లెసిస్ 15 పరుగులతో ఆడుతున్నారు.
ఆర్సీబీ టార్గెట్ 169
ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మిల్లర్(34) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ హసరంగా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాండ్యా 41, తెవాటియా 2 పరుగులతో ఆడుతున్నారు.
15 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 118/3
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 36, డేవిడ్ మిల్లర్ 32 పరుగులతో ఆడుతున్నారు.
సాహా(31) రనౌట్.. మూడో వికెట్ డౌన్
31 పరుగులు చేసిన సాహా రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.
8 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 58/2
ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా 31, హార్దిక్ పాండ్యా 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 16 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ ఒక్క పరుగు మత్రమే చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022లో గురువారం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్ చేరగా.. ఆర్సీబీ వరుస పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలు గల్లంతు చేసుకుంది. నేటి మ్యాచ్‌లో గుజరాత్‌ను భారీ తేడాతో ఓడిస్తేనే ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి.
తొలి అంచె పోటీలో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తెవాటియా, మిల్లర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను గెలిపించారు.
Related News By Category
Related News By Tags
-
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల న...
-
సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 33వ ప్ల...
-
దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి
టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ కోసం పురుషుల లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. ...
-
అతడొక అద్భుతం.. నమ్మబుద్ధికాలేదు: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీ...
-
హార్దిక్ సూపర్ షో
భారత జట్టులోకి కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా తన వాడిని, స్థాయిని ప్రదర్శించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని వచ్చి అంచనాలకు తగినట్లుగా చెలరేగుతూ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు....


