Breadcrumb
Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
లివింగ్‌స్టోన్, ధావన్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 62 పరుగులతో నిలకడ చూపించగా.. ఆఖర్లో లివింగ్‌స్టోన్ 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ విజయాన్ని సులువు చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ చెరొక వికెట్ తీశారు.
విజయానికి చేరువగా పంజాబ్ కింగ్స్.. 15 ఓవర్లలో 117/2
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయానికి చేరువ అయింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 62, లివింగ్‌స్టోన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టార్గెట్ 144.. 7 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 58/1
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 35, బానుక రాజపక్స 21 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జానీ బెయిర్ స్టో ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.
టార్గెట్ 144.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన జానీ బెయిర్ స్టో మహ్మద్ షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది.
రాణించిన సాయి సుదర్శన్.. గుజరాట్ టైటాన్స్ 20 ఓవర్లలో 143/8
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు నాటౌట్ రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సుదర్శన్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. సాహా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా రబాడ బౌలింగ్‌లో వరుస బంతుల్లో రాహుల్ తెవాటియా(11), రషీద్ ఖాన్(0)లను వెనక్కి పంపాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
15 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 98/4
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 40, రాహుల్ తెవాటియా 7 పరుగులతో ఆడుతున్నారు.
నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్ 56/3
9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. సుదర్శన్ 10, మిల్లర్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రిషి ధవన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
సాహా(21) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాహా రబాడ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించిన గిల్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రిషి ధవన్ డైరెక్ట్ హిట్‌కు గిల్ వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, కేవలం ఒక్క ఓటమితో ఎదురులేకుండా దూసుకెళ్తున్న గుజరాత్‌ను పంజాబ్ కింగ్స్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.
ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి పంజాబ్ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది చూడాలి
Related News By Category
Related News By Tags
-
నితీశ్ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు.. వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమే!
ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో పేస్ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం చాలా ఎక్కువ. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వ...
-
అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. చాన్నాళ్లుగా గాయం కారణంగా బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందిన ఈ ఆంధ్ర ఆటగాడు...
-
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
ఆస్ట్రేలియా-‘ఎ’తో సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన మెన్స్ సెలక్షన్ కమిటీ.. వన్డే జట్టుకు రుత...
-
ఇదేమి బ్యాటింగ్ బ్రో.. 25 బంతులాడి డకౌటా?
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ఆడుతున్న భారత వెటరన్ మయాంక్ అగర్వాల్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా మిడిలెక్స్‌తో జరుగ...
-
ధోనితో ఉన్న ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా?
టీమిండియా క్రికెటర్లకు సంబంధించి చాట్ జీపీటీ ద్వారా చేసిన పాత ఫోటోల ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన ప్రస్తుతం క్రికెటర్లు 80వ దశకంలో ఇలా ఉండేవారంటూ పెట్టిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ఇ...


