
Breadcrumb
గుజరాత్‌కు షాకిచ్చిన ముంబై.. సీజన్లో రెండో విజయం నమోదు
May 6 2022 7:01 PM | Updated on May 6 2022 11:28 PM

Live Updates
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ అప్డేట్స్
గుజరాత్‌కు షాకిచ్చిన ముంబై.. సీజన్లో రెండో విజయం నమోదు
178 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఓపెనర్లు గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆఖరి ఓవర్ ముందు వరకు విజయం దిశగా సాగింది. అయితే ఆఖరి ఓవర్లో ముంబై అనూహ్యంగా పుంజుకుని సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన తరుణంలో డేనియల్ సామ్స్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్‌కు మూడో ఓటమిని రుచి చూపించాడు. గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్దే ఆగిపోయి, 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ 2, పోలార్డ్ ఓ వికెట్ పడగొట్టగా.. తెవాతియా, హార్దిక్ రనౌటయ్యారు.
అంతకుముందు రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్సర్), ఆఖర్లో టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, ఫెర్గుసన్, అల్జరీ జోసఫ్, సాంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.
హార్ధిక్ రనౌట్
14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన తరుణంలో హార్ధిక్ పాండ్యా (14 బంతుల్లో 24; 4 ఫోర్లు) రనౌటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 158/4.
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్
పోలార్డ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ (11 బంతుల్లో 14; ఫోర్, సిక్స్) హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 138/3. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా (14), మిల్లర్ ఉన్నారు. గుజరాత్ గెలవాలంటే 24 బంతుల్లో మరో 40 పరుగులు చేయాల్సి ఉంది.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్
మురుగన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్లో గుజరాత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి గిల్‌ను పెవిలియన్‌కు పంపిన అశ్విన్.. ఆఖరి బంతికి సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ను కూడా ఔట్ చేశాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 111/2. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా (2), సాయి సుదర్శన్ ఉన్నారు.
గిల్ ఔట్
అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నంచిన గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు).. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
చితక్కొడుతున్న ఓపెనర్లు.. విజయం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్
ఓపెనర్లు సాహా (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (29 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్ధరి దాటికి గుజరాత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసి, విజయం దిశగా దూసుకెళ్తుంది.
ధాటిగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు
178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు సాహా (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (13 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 54/0.
టిమ్ డేవిడ్ మెరుపులు.. గుజరాత్ ముందు ఓ మోస్తరు లక్ష్యం
తొలుత రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్సర్), ఆఖర్లో టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓ మోస్తరు స్కోర్‌ను సాధించింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, ఫెర్గుసన్, అల్జరీ జోసఫ్, సాంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.
ముంబై ఆరో వికెట్ డౌన్
ఫెర్గూసన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డేనియల్ సామ్స్ (0) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 164/6. క్రీజ్‌లో టిమ్ డేవిడ్ (32), మురుగన్ అశ్విన్ ఉన్నారు.
తిలక్ వర్మ రనౌట్
హార్ధిక్ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో తిలక్ వర్మ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు)ను రనౌట్ చేశాడు. 18.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 164/5. క్రీజ్‌లో టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్ సామ్స్ ఉన్నారు.
దెబ్బేసిన రషీద్ ఖాన్.. పోలార్డ్ క్లీన్ బౌల్డ్
రషీద్ ఖాన్ ముంబై ఇండియన్స్‌ను మరో దెబ్బేశాడు. విధ్వంసకర ఆటగాడు కీరన్ పోలార్డ్ (14 బంతుల్లో 4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 120/4. క్రీజ్‌లో తిలక్ వర్మ (9), టిమ్ డేవిడ్ (1) ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. ఇషాన్ ఔట్
అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ బాట పట్టాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 111/3. క్రీజ్‌లో తిలక్ వర్మ (7), పోలార్డ్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
99 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 13; సిక్సర్) ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ (40), తిలక్ వర్మ (6) క్రీజ్‌లో ఉన్నారు. 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 105/2.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
సూపర్ టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. రషీద్ ఎల్బీ అప్పీల్‌ను తొలుత అంపైర్ తిరస్కరించగా.. రివ్యూలో రోహిత్ ఔటైనట్లు స్పష్టంగా తేలింది. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 76/1. క్రీజ్‌లో ఇషాన్ (29), సూర్యకుమార్ (1) ఉన్నారు.
రెచ్చిపోయి ఆడుతున్న రోహిత్.. గేర్ మార్చిన ఇషాన్
ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) రెచ్చిపోయి ఆడుతున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 6 ఓవర్లలో 63 పరుగులు జోడించారు.
దూకుడుగా ఆడుతున్న రోహిత్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 24 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ (4 బంతుల్లో 4) నిదానంగా ఆడుతున్నాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 29/0.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్
బ్రబోర్న్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న నామమాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, ఫెర్గూసన్, మహ్మద్ షమీ
Related News By Category
Related News By Tags
-
'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది'
అరంగేట్ర సీజన్లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రసింశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లో టీమి...
-
IPL 2022 Winner: అప్పుడు రాజస్తాన్.. ఇప్పుడు గుజరాత్
IPL 2022: ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోయిన హార్దిక్ సే...
-
IPL 2022: పొలార్డ్ కథ ముగిసింది.. జట్టు నుంచి తప్పించడం ఖాయం!
IPL 2022 MI Vs GT: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో వెస్టిండీస్ ‘హిట్టర్’ కీరన్ పొలార్డ్‌ను 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. కానీ ఈ సీజన్లో అతడు తన స్థాయికి తగ్గట్...
-
'కోల్‌కతా మ్యాచ్‌లో విలన్.. ఇప్పుడు హీరో.. శభాష్ సామ్స్'
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై బౌలర్ డానియల్ సామ్స్ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ ...
-
దురదృష్టం అంటే ఇదే మరి.. పాపం సాయి సుదర్శన్..!
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అనూహ్యంగా హిట్ వికెట్‌గా వెనుదిరిగా...