Breadcrumb
Live Updates
పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి చవిచూసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో రాయుడు 78 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్,సందీప్ శర్మ తలా ఒక్కవికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే
153 పరుగులు వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన రాయుడు కీలక సమయంలో ఔటయ్యాడు. సీఎస్కే విజయానికి 12 బంతుల్లో 35 పరుగులు కావాలి.
16 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 131/4
16 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 131/4. క్రీజులో రాయుడు(75), జడేజా(4) పరుగులతో ఉన్నారు. సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే
89 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన గైక్వాడ్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.13 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 90/4
రెండో వికెట్ వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సాంట్నర్.. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 32/2
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్
10 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రాబిన్ ఊతప్ప.. సందీప్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజలో గైక్వాడ్, సాంట్నర్ ఉన్నారు.
చెలరేగిన ధావన్.. సీఎస్కే టార్గెట్ 188 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(88) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో బ్రావో రెండు, తీక్షణ ఒక వికెట్ సాధించాడు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
142 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన రాజపాక్స.. బ్రావో బౌలింగ్‌లో ఔటయ్యాడు.
17 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 145/1
17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(73), రాజపాక్స(42) పరుగులతో ఉన్నారు.
13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 103/1
13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(46), రాజపాక్స(28) పరుగులతో ఉన్నారు.
9 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 63/1
9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి పంజాబ్ కింగ్స్ 63 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(26), రాజపాక్స(12) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
37 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగుల చేసిన మయాంక్ అగర్వాల్.. తీక్షణ బౌలింగ్‌లో దుబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
3 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 15/1
3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(10), శిఖర్ ధావన్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్కే
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్
Related News By Category
Related News By Tags
-
‘కెప్టెన్ మార్పు తథ్యం.. అతడికే పగ్గాలు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ముంబై ఇండియన్స్ తర్వాత ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు సీఎస్కే. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ...
-
పెద్దోడి మెరుపులు.. వణికిపోయిన సీఎస్కే బౌలర్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆంటిగ్వా గెలు...
-
CSKలో ఏకంగా 25 శాతం వాటా అడిగిన ధోని?
మహేంద్ర సింగ్ ధోని... చెన్నై సూపర్ కింగ్స్.. ఈ రెండు పేర్లు పర్యాయపదాల్లాంటివని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ నుంచి అన్నీ తానై ధోని సీఎస్కేను ముందుకు న...
-
సీఎస్కే కోచ్‌గా వరల్డ్ కప్ విన్నర్..? అశ్విన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో ఇటీవలే విడిపోయిన సీఎస్కే.. కొత్త కోచ్ కోసం అన్వేషణ సాగిస్తున్న వేళ మాజీ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ...
-
సీఎస్కే హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్!
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్‌కోచ్ కోసం వేట ప్రారంభించింది. హెమాంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలోకి వచ్చి...


