IPL 2022 Auction: వేలంలో పాల్గొనబోయే యువ భారత చిచ్చరపిడుగులు వీళ్లే.. 

IPL 2022 Auction: India Under 19 Players In Auction - Sakshi

బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ప్రస్తుతం ప్రపంచకప్‌ ఆడుతున్న భారత అండర్‌-19 జట్టు కుర్రాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యువ భారత జట్టు కెప్టెన్‌ యశ్ ధుల్‌తో పాటు మరో ఏడుగురు భారత ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఓపెనర్‌ హర్నూర్ సింగ్‌, ఆల్‌రౌండర్లు కుశాల్ తాంబే, అనీశ్వర్‌ గౌతమ్‌, రాజ్ అంగద్‌ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, బౌలర్లు విక్కీ ఓస్వల్‌, వాసు వత్స్ మెగా వేలానికి షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. వీరిలో రాజవర్థన్ హంగార్గేకర్ బేస్ ప్రైజ్ రూ. 30 లక్షలు కాగా, మిగిలిన అందరూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడనున్నారు. 

కాగా, కరీబియన్‌ దీవులు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌కు షాకిచ్చి ఫైనల్‌ ఫోర్‌కు చేరుకుంది. రేపు జరగబోయే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. తొలి సెమీస్‌లో ఇవాళ ఇంగ్లండ్‌, అఫ్ఘానిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి.

 ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి.  ఇందులో 228 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా... 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్‌ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్‌ నుంచి 5, ఇంగ్లండ్‌ నుంచి 24, ఐర్లాండ్‌ నుంచి 5, న్యూజిలాండ్‌ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్‌ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్‌ నుంచి ఒకరు, స్కాట్లాండ్‌ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. 
చదవండి: IPL Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధావన్‌, వార్నర్‌ భాయ్‌.. ఇంకా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top