IPL 2022: AB De Villiers Could Reunite With RCB As Mentor, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022 - AB De Villiers: మళ్లీ ఆర్సీబీలోకి ఏబీడీ..?

Mar 8 2022 10:16 PM | Updated on Mar 9 2022 7:46 AM

IPL 2022: AB De Villiers Could Reunite With RCB As Mentor - Sakshi

AB De Villiers To Reunite With RCB: గతేడాది ఐపీఎల్‌ తర్వాత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ కోసం ఏబీడీ మరోసారి ఆర్సీబీతో జతకట్టనున్నాడని సమాచారం. అయితే ఈసారి క్రికెటర్‌గా కాకుండా జట్టు మెంటార్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకున్నాడని ఆర్సీబీ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆర్సీబీ తమ నూతన సారధి పేరును ఇప్పటివరకు ప్రకటించలేదు. కెప్టెన్‌ రేసులో డుప్లెసిస్‌, దినేశ్‌ కార్తీక్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి మాత్రం క్లారిటీ లేదు. మార్చి 12న ఓ సర్‌ప్రైజ్ ఉందటూ ఫ్రాంచైజీ యాజమాన్యం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ కెప్టెన్‌ అంశం కొలిక్కివచ్చేది లేనిది అనుమానమే. మరోవైపు జట్టుకు సంబంధించి జెర్సీని, లోగోను మార్చనున్నారని తెలుస్తోంది.
చదవండి: IPL 2022 Auction Day 1: ఆ ఇద్దరి కోసం భారీగా ఖర్చు చేసిన ఆర్సీబీ...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement