
వనిందు హసరంగ
IPL Mega Auction 2022 Day 1, RCB Purchased Players List: ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన తమ ఆటగాడు హర్షల్ పటేల్‌ను 10 కోట్ల 75 లక్షలు వెచ్చించి తిరిగి సొంతం చేసుకుంది.
శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు కూడా ఇంతే మొత్తాన్ని ఖర్చుచేసింది. తొలి రోజు వేలం ముగిసే సరికి ఆర్సీబీ పర్సులో 9.25 కోట్లు ఉన్నాయి. మొత్తం ఖాళీలు- 15 కాగా.. విదేశీ ఆటగాళ్ల కోటాలో 4 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఇక బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కోహ్లి (రూ.15 కోట్లు) , మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు) , సిరాజ్ (రూ. 7 కోట్లు)ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
►హర్షల్ పటేల్ - రూ. 10 కోట్ల 75 లక్షలు
►హసరంగ - రూ. 10 కోట్ల 75 లక్షలు
►హాజెల్‌వుడ్- రూ. 7 కోట్ల 75 లక్షలు
►డు ప్లెసిస్ - రూ. 7 కోట్లు
►దినేశ్ కార్తీక్ - రూ. 5 కోట్ల 50 లక్షలు
►అనూజ్ రావత్- రూ. 3 కోట్ల 40 లక్షలు
►షాబాజ్ అహ్మద్ - రూ. 2 కోట్ల 40 లక్షలు
►ఆకాశ్‌దీప్ - రూ. 20 లక్షలు
చదవండి: IPL 2022 Auction Day 1- SRH: పూరన్, సుందర్‌కు జాక్‌పాట్.. హైదరాబాద్ ప్లేయర్స్ వీళ్లే!