Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా'

IPL 2021: Sehwag Trolls SRH Batting Vs KKR I Fell Asleep Last Four Overs - Sakshi

Sehwag Trolls SRH Batting.. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరును వినూత్న రీతిలో ట్రోల్‌ చేశాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేలవ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకుడికి కూడా టెస్టు మ్యాచ్‌ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ కలిగించింది. 20 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. అందునా చివరి ఐదు ఓవర్లలో వేగంగా ఆడాల్సింది పోయి జిడ్డుగా ఆడి 36 పరుగులు మాత్రమే చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని సెహ్వాగ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరును ట్రోల్స్‌ చేస్తూ కామెంట్స్‌ చేశాడు.

చదవండి: IPL 2021: సూపర్‌ త్రో.. విలియమ్సన్‌ రనౌట్‌; సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చెత్త రికార్డు

''రాయ్‌, సాహాలతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. అయితే వారిద్దరు తర్వగానే పెవిలియన్‌ చేరారు. తర్వాత వచ్చిన విలియమ్సన్‌, గార్గ్‌లు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని భావించా. ఇంతలో విలియమ్సన్‌ రనౌట్‌.. 21 పరుగులు చేసి గార్గ్‌ కూడా ఔటయ్యాడు. ఇక అబ్దుల్‌ సమద్‌ వచ్చి రావడంతోనే మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. మ్యాచ్‌ కాస్త మజాగా అనిపిస్తుందని అనుకుంటున్న తరుణంలోనే అతను ఔటయ్యాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కు మిగిలింది ఐదు ఓవర్లు. కనీసం ఇప్పుడైనా మెరుపులు మెరిపిస్తారనుకున్నా. ఒక ఓవర్‌ ముగిసాక ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్స్‌ నాకు నిద్రమాత్రల్లా కనిపించారు. ఇంకేముందు చివరి నాలుగు ఓవర్లు ఆదమరిచి నిద్రపోయా. లేచి చూసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 115/8 గా ఉంది. నాలుగు ఓవర్లు చూడకపోవడమే మంచిదైంది'' అంటూ ఫేస్‌బుక్‌ వీడియోలో కామెంట్‌ చేశాడు.  

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటికే ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఇంటిబాట పట్టింది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. కాగా సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. 

చదవండి: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అత్యంత ఫాస్ట్‌బాల్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top