IPL 2021: సూపర్‌ త్రో.. విలియమ్సన్‌ రనౌట్‌; సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చెత్త రికార్డు

Shakib Stunning Throw Kane Williamson Run Out Worst Record SRH Captain - Sakshi

SRH Makes Worst Record After Kane Williamson Run Out.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ రనౌట్‌ అయిన సంగతి తెలిసిందే. షకీబ్‌ డైరెక్ట్‌ త్రోకు విలియమ్సన్‌ వెనుదిరగాల్సి వచ్చింది. 26 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో షకీబ్‌ వేసిన ఐదో బంతి మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. పరుగు తీయడం రిస్క్‌తో కూడుకున్నదని తెలిసినప్పటికి అనవసరంగా పరిగెత్తి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రనౌట్‌ విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్లు మూడుసార్లు రనౌట్‌ కావడం విశేషం.  రెండుసార్లు డేవిడ్‌ వార్నర్‌.. తాజాగా విలియమ్సన్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఉన్నాడు. ఈ సీజన్‌లో పంత్‌ రెండుసార్లు రనౌట్‌ అయ్యాడు. ఇక సీఎస్‌కే, రాజస్తాన్‌ మినహా మిగిలిన టీమ్‌ల కెప్టెన్లు ఒక్కసారి రనౌట్‌గా వెనుదిరిగారు.


Courtesy: IPL Twitter

ఇక కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అబ్దుల్‌ సమద్‌ 25, ప్రియమ్‌ గార్గ్‌ 21 పరుగులు చేశారు. కేకేఆర్‌ బౌలర్ల దాటికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మెన్‌  కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్‌ బౌలర్లలో సౌథీ, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్‌ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: IPL 2021: హర్షల్‌ పటేల్‌ సూపర్‌ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌; కోహ్లి గెంతులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top