IPL 2021: హర్షల్‌ పటేల్‌ సూపర్‌ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌; కోహ్లి గెంతులు

Harshal Patel Super Throw Sharuk Khan Run Out RCB Turning Point Vs PBKS - Sakshi

Harshal Patel Super Throw Turning Point For RCB.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సత్తా చాటింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే 19వ ఓవర్‌ వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. ఇక ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి.

కాగా 20వ ఓవర్‌ను హర్షల్‌ పటేల్‌ వేశాడు. కాగా హర్షల్‌ తన తొలి బంతికే షారుక్‌ ఖాన్‌ను అద్భుత త్రోతో  రనౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. మ్యాచ్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు ఒక ఫోర్‌.. ఒక సిక్స్‌తో షారుక్ మంచి టచ్‌లో ఉన్నాడు. అతను స్ట్రైక్‌ తీసుకోవాలని భావించాడు. అందుకే హర్షల్‌ వేసిన తొలి బంతిని హెన్రిక్స్‌ ఢిఫెన్స్‌ ఆడినప్పటికి షారుక్‌ అనవసరంగా పరుగుకు కాల్‌ ఇచ్చాడు. ఇంకేముంది అప్పటికే సగం క్రీజులో ఉన్న హర్షల్‌ మెరుపువేగంతో బంతిని త్రో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షారుక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఇక షారుక్‌ అవుటయ్యాడని తెలియగానే కోహ్లి సంబరాలు మాములుగా లేవు. మైదానంలో నే గెంతులు వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

చదవండి: కేఎల్‌ రాహుల్‌ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి

Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top