ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ | Fans Comments After Glenn Maxwell Huge Sixes Sent Ball On Road Viral | Sakshi
Sakshi News home page

Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ

Oct 3 2021 4:57 PM | Updated on Oct 3 2021 8:01 PM

Fans Comments After Glenn Maxwell Huge Sixes Sent Ball On Road Viral - Sakshi

Courtesy: IPL Twitter

Maxwell Power Hitting Sixes.. పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం 37 పరుగులతో ఆడుతున్న మ్యాక్సీ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు ఉన్నాయి. ఇందులో మ్యాక్సీ​ కొట్టిన రెండు సిక్సర్లు స్టేడియం అవతల పడ్డాయి. షార్జా స్టేడియం చిన్నదైనప్పటికి మ్యాక్సీ భారీ సిక్సర్లతో తన పవరేంటో చూపించాడు. మొదట హర్‌ప్రీత్‌ బార్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ నాలుగో బంతిని మ్యాక్స్‌వెల్‌ డీప్‌స్వ్కేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్స్‌ కొట్టాడు. అతని పవర్‌ దాటికి బంతి స్టేడియం అవతల ఉన్న రోడ్డుపై పడింది.  

ఆ తర్వాత రవి బిష్ణోయి బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో మెరిశాడు. ఈసారి డీప్‌మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టగా.. ఈసారి కూడా బంతి రోడ్డుపై పడింది. ప్రస్తుతం మ్యాక్సీ కొట్టిన రెండు సిక్సర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకసారి అంటే సరే.. మళ్లీ మళ్లీనా అంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ ఉత్సాహంతో కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఆర్‌సీబీ 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 43, డివిలియర్స్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: ఔట్‌ కాదా.. అంపైర్‌పై కేఎల్‌ రాహుల్‌ అసహనం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement