IPL 2021 Qualifier 2 DC Vs KKR : ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ సూపర్‌ విక్టరీ.. ఢిల్లీ ఔట్‌

IPL 2021: DC Vs KKR Qualifier 2 Match Live Updates And Highlights - Sakshi

ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ సూపర్‌ విక్టరీ.. ఢిల్లీ ఔట్‌
136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌(41 బంతుల్లో 55; 4 ఫోర్లు‌, 3 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌(46 బంతుల్లో 46; ఫోర్‌, సిక్స్‌) శుభారంభాన్ని అందించినప్పటికీ కేకేఆర్‌ మిడిలార్డర్‌ దారుణంగా విఫలం కావడంతో మ్యాచ్‌ స్వరూపం ఒక్కసారిగా మారిపోయి ఆఖరి ఓవర్‌లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాట ఆడింది. అయితే మరో బంతి మిగిలుండగా రాహుల్‌ త్రిపాఠి అద్భుతమైన సిక్సర్‌ బాది కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దీంతో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీపై థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించి సగర్వంగా ఫైనల్‌కు చేరింది. కేకేఆర్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌లో చెన్నైతో పోరుకు అర్హత సాధించింది.

రసవత్తరంగా మారిన మ్యాచ్‌.. కేకేఆర్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌ బౌలర్‌ రబాడ 18వ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి దినేశ్‌ కార్తీక్‌(0) వికెట్‌ను పడగొట్టడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. 18 ఓవర్ల తర్వత కేకేఆర్‌ స్కోర్‌ 126/4. క్రీజ్‌లో రాహుల్‌ త్రిపాఠి(2), మోర్గాన్‌ ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. శుభ్‌మన్‌ గిల్‌(46) ఔట్‌
ఆవేశ్‌ ఖాన్‌ వేసిన 16.4 ఓవర్లో వికెట్‌ కీపర్‌ పంత్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌(46 బంతుల్లో 46; ఫోర్‌, సిక్స్‌) ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వత కేకేఆర్‌ స్కోర్‌ 125/3. క్రీజ్‌లో రాహుల్‌ త్రిపాఠి(1), దినేశ్‌ కార్తీక్‌ ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. నితీశ్‌ రాణా(13) ఔట్‌
కేకేఆర్‌ విజయానికి 25 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన తరుణంలో నితీశ్‌ రాణా(12 బంతుల్లో 13; సిక్స్‌) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. నోర్జే బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి రాణా ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వత కేకేఆర్‌ స్కోర్‌ 123/2. క్రీజ్‌లో గిల్‌(45), రాహుల్‌ త్రిపాఠి ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌(55) ఔట్‌
స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(41 బంతుల్లో 55; 4 ఫోర్లు‌, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధ శతకంతో రాణించి విజయం ముంగిట రబాడ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ స్కోర్‌ 98/1. క్రీజ్‌లో గిల్‌(32), నితీశ్‌ రాణా(1) ఉన్నారు.

ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్‌
పిచ్‌ నెమ్మదిగా ఉన్నప్పటికీ కేకేఆర్‌ ఓపెనర్లు ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. శుభ్‌మన్‌ గిల్‌(33 బంతుల్లో 31; ఫోర్), వెంకటేశ్‌ అయ్యర్‌(39 బంతుల్లో 51; 3 ఫోర్లు‌, 3 సిక్సర్లు) ఒత్తిడికి లోను కాకుండా సింగల్స్‌ తీస్తూ స్కోర్‌ బోర్డును నెమ్మదిగా నడిపిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ స్కోర్‌ 92/0.  

ధాటిగా ఆడుతున్న కేకేఆర్‌ ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 51/0
136 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. శుభ్‌మన్‌ గిల్‌(16 బంతుల్లో 17; ఫోర్), వెంకటేశ్‌ అయ్యర్‌(20 బంతుల్లో 31; 2 ఫోర్లు‌, 2 సిక్సర్లు) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. కేకేఆర్‌ను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 51/0.


Photo Courtesy: IPL

ఢిల్లీ నామమాత్రపు స్కోర్‌.. కేకేఆర్‌ టార్గెట్‌ 136
కేకేఆర్‌ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్‌ మాత్రమే చేయగలిగింది. ధవన్‌(36), శ్రేయస్‌ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌) ఓ మోస్తారుగా రాణించడంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కేకేఆర్‌ బౌలర్లు వరుణ్‌ చక్రవర్తి(2/26), ఫెర్గూసన్‌(1/26), శివమ్‌ మావి(1/27), షకీబ్‌(0/28), సునీల్‌ నరైన్‌(0/27) తమ కోటా ఓవర్లు ముగించి ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. 


Photo Courtesy: IPL

హెట్‌మైర్‌ రనౌట్‌.. ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెట్‌మైర్‌ 17 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు. నరైన్‌ ఓవర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. సింగిల్‌ రిస్క్‌ అని తెలిసినప్పటికి నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న హెట్‌మైర్‌ సగం పిచ్‌ దాటేశాడు . అయితే అక్కడే ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌ త్రో వేయగా.. కార్తీక్‌ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది

ఢిల్లీకి బిగ్‌ షాక్‌.. పంత్‌(6) ఔట్‌
15.2 ఓవర్లో ఢిల్లీ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(6 బంతుల్లో 6; ఫోర్‌) ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో ఢిల్లీ 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(9), హెట్‌మైర్‌ ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. ధవన్‌(36) ఔట్‌
కేకేఆర్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఢిల్లీ జట్టును మరో దెబ్బ కొట్టాడు. తొలుత ఓపెనర్‌ పృథ్వీ షాను ఔట్‌ చేసిన అతను..15వ ఓవర్‌ తొలి బంతికి ధవన్‌(39 బంతుల్లో 36; ఫోర్‌, 2 సిక్సర్లు)ను కూడా బోల్తా కొట్టించాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో షకీబ్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో ధవన్‌ వెనుదిరిగాడు. 14.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 83/3. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(8), రిషబ్‌ పంత్‌ ఉన్నారు.

స్టోయినిస్‌(18) క్లీన్‌ బౌల్డ్‌.. ఢిల్లీ 71/2
ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో శివమ్‌ మావి బౌలింగ్‌లో స్టోయినిస్‌(23 బంతుల్లో 18; ఫోర్‌) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. 11.3 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 71/2. క్రీజ్‌లో ధవన్‌(32), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.  

ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ.. 11 ఓవర్ల తర్వాత 70/1
5వ ఓవర్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా(18) వికెట్‌ కోల్పోయాక ఢిల్లీ జట్టు ఆచితూచి ఆడుతుంది. ధవన్‌(32 బంతుల్లో 31; ఫోర్‌, 2 సిక్సర్లు), స్టోయినిస్‌(22 బంతుల్లో 18; ఫోర్‌) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్‌ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 11 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 70/1.  


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18) ఔట్‌
టాస్‌ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదె​బ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా(12 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌) వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 32/1. క్రీజ్‌లో ధవన్‌(14), స్టోయినిస్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 చివరి అంకానికి చేరుకుంది. క్వాలిఫయర్‌ 2లో భాగంగా నేడు జరగనున్న డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. నేటి మ్యాచ్‌ విజేత అక్టోబర్‌ 15న జరిగే ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుండగా, ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమించనుంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేటి మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇక ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఇరు జట్లు 28 సార్లు హెడ్‌ టూ హెడ్‌ తలపడగా.. కేకేఆర్‌ 15 మ్యాచ్‌ల్లో, ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ప్రస్తుత సీజన్ లీగ్ దశలో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. 

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్‌: శిఖర్ ధవన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్‌ (కెప్టెన్‌), హెట్‌మైర్‌‌, స్టోయినిస్, అక్షర్‌ పటేల్‌, ఆర్ అశ్విన్‌, అన్రిచ్ నోర్జే‌, కాగిసో రబాడ‌, అవేష్‌ ఖాన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), షకిబ్‌ ఉల్ హాసన్, సునీల్ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top