DC Vs KKR: ఆ నలుగురి ముంగిట ఉన్న రికార్డులివే!

IPL 2021 DC Vs KKR: 4 Milestones To Be Watch Out For In Qualifier 2 - Sakshi

4 milestones to watch out for in Qualifier 2: ఐపీఎల్‌-2021 సీజన్‌లో బుధవారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో చెన్నైని ఢీకొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సమాయత్తమవుతున్నాయి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 29 సార్లు ముఖాముఖి తలపడగా కోల్‌కతా 15 సార్లు గెలుపొంది పైచేయి సాధించింది. ఢిల్లీ 13 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. నేటి(అక్టోబరు 13) మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం!

పంత్‌(Rishabh Pant) 8 పరుగులు చేస్తే..
శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.. టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌. ఈ సీజన్‌లో తొలి అంచెలో ఢిల్లీ అద్భుతంగా రాణించడంతో.. శ్రేయస్‌ జట్టులోకి తిరిగి వచ్చినా.. ఫ్రాంఛైజీ అతడినే సారథిగా కొనసాగించింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే.. పంత్‌ జట్టును టేబుల్‌ టాపర్‌గా నిలిపాడు. బ్యాటర్‌గానూ తన వంతు సేవలు అందించాడు. ఐపీఎల్‌-2021లో 15 మ్యాచ్‌లలో పంత్‌ 413 పరుగులు సాధించాడు. ఇక క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో అతడు గనుక 8 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌ కెరీర్‌లో 2500 రన్స్‌ మైలురాయిని చేరుకుంటాడు.

అక్షర్‌ పటేల్‌(Axar Patel)...
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో గేమ్‌ చేంజర్‌గా పలు కీలక మ్యాచ్‌ల విజయాల్లో భాగమయ్యాడు అక్షర్‌ పటేల్‌. బౌలర్‌గా, బ్యాటర్‌గా తన వంతు పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో తుది జట్టులో గనుక అక్షర్‌ చోటు దక్కించుకుని... 5 వికెట్లు తీయగలిగితే ఐపీఎల్‌ 100 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఇక ఈ సీజన్‌లో అతడు ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టాడు.

మోర్గాన్‌(Eoin Morgan) పూర్తి చేస్తాడా?
ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌-2021 రెండో అంచెలో అద్భుత విజయాలు సాధించింది. వరుస విజయాలతో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అయితే, బ్యాటర్‌గా మాత్రం మోర్గాన్‌ ఇంతవరకు మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. నేటి మ్యాచ్‌లో మోర్గాన్‌ 9 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్‌ కెరీర్‌లో వెయ్యి పరుగుల మార్కును చేరుకుంటాడు. 

డీకే(Dinesh Karthik) ముంగిట బౌండరీల రికార్డు
కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 214 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో డీకే ఒక్క బౌండరీ బాదితే చాలు.. ఐపీఎల్‌లో 400 ఫోర్లు తన పేరిట లిఖించుకోగలుగుతాడు. తద్వారా లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు. 

మరి వీళ్లందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా?! 

చదవండి: Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-10-2021
Oct 13, 2021, 10:37 IST
ఏ రోజైతే మీరు 180 పరుగులు చేయలేకపోయారో.. ఆరోజే...
13-10-2021
Oct 13, 2021, 09:57 IST
యూఏఈకి వచ్చిన తర్వాత మేము ఒక్కో సవాలును దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాం!
12-10-2021
Oct 12, 2021, 21:12 IST
DC Players Have Fun Pool Session.. ఐపీఎల్‌ 2021లో కేకేఆర్‌తో క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు...
12-10-2021
Oct 12, 2021, 20:08 IST
Avesh Khan As Net Bowelr For Team India T20 WC 2021.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌...
12-10-2021
Oct 12, 2021, 19:20 IST
Gautam Gambhir Lauds Sunil Narine.. టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌పై...
12-10-2021
Oct 12, 2021, 18:32 IST
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం...
12-10-2021
Oct 12, 2021, 18:15 IST
David Warner Intrested Play For SRH IPL 2022.. ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు...
12-10-2021
Oct 12, 2021, 15:59 IST
Virat Kohli Cried After He Lost Against Kkr: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో...
12-10-2021
Oct 12, 2021, 15:58 IST
Sunil Narine Was Only 2nd Bowler Dismiss RCB Trio.. ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌...
12-10-2021
Oct 12, 2021, 15:14 IST
IPL 2021 Viewership Ratings.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆఖరి దశకు చేరుకుంది. క్వాలిఫయర్‌ 2తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌...
12-10-2021
Oct 12, 2021, 14:27 IST
ఆర్సీబీ ఓటమి.. కోహ్లి భావోద్వేగ పోస్టు
12-10-2021
Oct 12, 2021, 14:23 IST
AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్‌ 2021లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ...
12-10-2021
Oct 12, 2021, 13:23 IST
Daniel Christian and his partner face flak on social media: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆటగాడు...
12-10-2021
Oct 12, 2021, 09:17 IST
RCB Vs KKR: ఆర్సీబీకి ఇదొక గొప్ప సీజన్‌. దురదృష్టవశాత్తూ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాం!
12-10-2021
Oct 12, 2021, 08:32 IST
RCB Vs KKR: కచ్చితంగా వాళ్లు విజయానికి అర్హులే. తదుపరి రౌండ్‌కు వెళ్లే అర్హత వారికుందని నిరూపించారు!
12-10-2021
Oct 12, 2021, 05:01 IST
ఐపీఎల్‌–14 నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు నిష్క్రమించింది. విరాట్‌ కోహ్లి సారథ్యం కూడా నిరాశగానే ముగిసింది. కోల్‌కతా...
11-10-2021
Oct 11, 2021, 23:45 IST
Virat Kohli RCB Captain As Last IPL 2021... ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి కథ ముగిసింది. ఈసారి...
11-10-2021
Oct 11, 2021, 23:13 IST
ఐపీఎల్‌ 2021లో భాగంగా ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల...
11-10-2021
Oct 11, 2021, 23:04 IST
Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక...
11-10-2021
Oct 11, 2021, 22:30 IST
Virat Kohli Argument With Umpire Virender Sharma.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లి తనకు ఇదే చివరి సీజన్‌... 

Read also in:
Back to Top