Interim Budget 2024: బడ్జెట్‌లో క్రీడలకు రూ. 3,442 కోట్లు | Interim Budget 2024: Sports Ministry Get 3442 Crores As Rs 45 Crore Boost | Sakshi
Sakshi News home page

Interim Budget 2024: బడ్జెట్‌లో క్రీడలకు రూ. 3,442 కోట్లు: ఆ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు

Feb 2 2024 9:33 AM | Updated on Feb 2 2024 10:50 AM

Interim Budget 2024: Sports Ministry Get 3442 Crores As Rs 45 Crore Boost - Sakshi

Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్‌లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు.

కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్‌ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు.

ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు.  నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు.   

చదవండి: భారత్‌తో డేవిస్‌కప్‌ మ్యాచ్‌పై పాకిస్తాన్‌లో అనాసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement