గేల్‌ను మరిపించే పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌

Instagram In Awe Of Kid Hitting Powerful Shots - Sakshi

న్యూఢిల్లీ:  త్వరలో ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం కాబోతుండగా, తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఒక బుడతడి వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.  బిల్డింగ్‌ స్టెప్స్‌పైనే బ్యాట్‌ పట్టుకుని కూర్చొన్న ఈ చిన్నోడికి కొన్ని బంతుల్ని వేస్తే భారీ హిట్టింగ్‌లతో విరుచుకుపడ్డాడు. కచ్చితమైన హిట్టింగ్‌ ఆడిన ఈ బుడతడిని చూసి నెటిజన్లు తెగమురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్‌ చేసిన ఆకాశ్‌ చోప్రా.. ‘ఈ పిల్లాడు ఎంత బాగా ఆడుతున్నాడు’ అనే కామెంట్‌ చేశాడు.

అచ్చం క్రిస్‌ గేల్‌ను మరిపిస్తున్నాడని కొందరు అభినందించగా, యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌ శైలిని పోలి ఉన్నాడని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఆ చిన్నోడిలో బ్యాట్‌ స్వింగ్‌ అదిరిపోయిందంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలో  ఓ టీ20 మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ 360 డిగ్రీస్‌ తరహాలో ఆరు సిక్సర్లు కొట్టిన జ్ఞాపకాల్ని ఈ బుడతడు గుర్తుచేశాడని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ బుడతడుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top