ప్రపంచకప్ హాకీ టోర్నీ బరిలో భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నెదర్లాండ్స్‌లో జరిగే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. ఆగస్టు 14 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, వేల్స్ జట్లతో కలిపి భారత్‌కు చోటు కల్పించారు. ఆగస్టు 15న జరిగే తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. 1975లో ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు మరోసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరలేదు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది.
భారత పురుషుల హాకీ జట్టు: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్ ), మోహిత్, సూరజ్ కర్కేరా, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్, రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లలాగే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్, దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద్ లాక్రా, సుఖ్‌జీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, అభిషేక్.


