క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌.. | Indian Men's Team Into Quarter Finals Of Thomas Cup Badminton Team Tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌..

Apr 30 2024 9:59 AM | Updated on Apr 30 2024 9:59 AM

Indian Men's Team Into Quarter Finals Of Thomas Cup Badminton Team Tournament

ఇంగ్లండ్‌పై 5–0తో విజయం

థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

చెంగ్డూ (చైనా): డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్‌ ‘సి’లో సోమవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ 21–15, 21–15తో హ్యారీ హంగ్‌పై గెలిచి భారత్‌కు 1–0తో శుభారంభం ఇచ్చాడు.

రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–17, 19–21, 21–15తో బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ జంటపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–16, 21–11తో నదీమ్‌ డాలి్వపై నెగ్గడంతో భారత్‌ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.

నాలుగో మ్యాచ్‌లో అర్జున్‌–ధ్రువ్‌ కపిల జంట 21–17, 21–19తో రోరీ ఈస్టన్‌–అలెక్స్‌ గ్రీన్‌ ద్వయంపై గెలిచింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో కిరణ్‌ జార్జ్‌ 21–18, 21–12తో చోలన్‌ కేయాన్‌ను ఓడించడంతో భారత్‌ 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. గ్రూప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–1తో థాయ్‌లాండ్‌పై గెలుపొందింది. రేపు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్‌ టాపర్‌గా నిలుస్తుంది.

ఇవి చదవండి: కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ

Advertisement
 
Advertisement
Advertisement