
మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ భావిస్తుంటే.. టీమిండియా మాత్రం ప్రత్యర్దిని మట్టికర్పించి సిరీస్‌ను సమం చేయాలని కసితో ఉండి.
లార్డ్స్ టెస్టులో అనుహ్యంగా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైన గిల్ సేన, నాలుగో టెస్టులో తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్‌కు మాజీ కెప్టెన్ అజింక్య రహానే కీలక సూచన చేశాడు.
మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు అదనపు ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగాలని రహానే అభిప్రాయపడ్డాడు. లార్డ్స్ టెస్టులో టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.
"లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ స్కోర్‌ను సాధించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. రాబోయే మ్యాచ్‌లో భారత్ అదనంగా ఓ ఫాస్ట్ బౌలర్‌ను ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓ టెస్టు మ్యాచ్‌ను గెలవాలంటే ప్రత్యర్ధి జట్టులోని 20 వికెట్లను పడగొట్టాలి.
ప్రస్తుతం భారత బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గానే రాణిస్తున్నారు. కాబట్టి ఎక్స్‌ట్రా ఓ బౌలర్ జట్టులో ఉండాలన్నది నా అభిప్రాయం. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా 40 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కన్పించింది. కానీ ఆ సమయంలో కరుణ్ నాయర్ ఎల్బీ రూప్‌లో ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
ఆ వికెట్‌తో మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టుబిగించింది. ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఎలాగైనా గెలవాలన్న కసి వారిలో కన్పించింది. ఫీల్డింగ్‌లో కూడా వందకు వంద శాతం ఎఫక్ట్ పెట్టారు" అని రహానే తన యూట్యూబ్ ఛానలో పేర్కొన్నారు.
చదవండి: ఫిట్‌గా లేకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకు: భారత మాజీ క్రికెటర్ ఫైర్